పాకశాస్త్రంలో చిన్నారుల సత్తా

NRI kid chefs win White House race
వాషింగ్టన్‌: అమెరికాలో జాతీయ స్థాయిలో నిర్వహించిన పాకశాస్త్ర పోటీల్లో ఐదుగురు భారతీయ చిన్నారులు తమ సత్తా చాటారని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వారితో పాటు మరో 51 మంది చిన్నారులు పాకశాస్త్ర ప్రావీణ్యంలో ప్రతిభ పాటవాలు ప్రదర్శించారని తెలిపింది.

వారి వివరాలను విడుదల చేసింది. మసాచ్‌సెట్స్‌ లోని ఫాల్‌మౌత్‌కు చెందిన షిఫాలీ సింగ్‌తోపాటు నార్త్‌ కరోలినాలోని చాపల్‌ హిల్‌ నివాసి విజయ్‌ డే, ఓహియోకు చెందిన అనీష్‌ పటేల్‌, పెన్సిల్వేనియాకు చెందిన గణేశ్‌ సెల్వకుమార్‌, టెక్సాస్‌లోని షుగర్‌లాండ్‌ నివాసి దేవనాషి ఉదేశీలు ఉన్నారని వైట్‌హౌస్‌ వర్గాలు ప్రకటించాయి.

వీరంతా మంగళవారం వైట్‌హౌస్‌లోని కిచెన్‌ గార్డెన్‌లో జరగనున్న 'స్టేట్‌ డిన్నర్‌' ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్‌ ఒబామా చేతుల మీదుగా పురస్కారాలు అందుకుంటారని తెలిపింది. అంతేకాకుండా మిషెల్‌ ఒబామాతో కలసి ఆ చిన్నారులంతా విందు ఆరగిస్తారని చెప్పింది.

యేటా వైట్‌హౌస్‌లో వివిధ కార్యక్రమాలు జరుగుతుంటాయి, వాటిలో 'స్టేట్‌ డిన్నర్‌' కార్యక్రమం అత్యంత ఇష్టమైనదని మిషెల్‌ వెల్లడించారని తెలిపింది. విందులో పాల్గొనటం వల్ల పిల్లల్లోని సౄఎజనాత్మకత, ప్రతిభపాటవాలు అతి దగ్గరగా తెలుసుకునే వీలు కలుగుతోందని ఆమె తెలిపారని వైట్‌హౌస్‌ వెల్లడించింది.

చిన్నారులతో విందు ఆరగించే శుభఘడియల కోసం వేచి చూస్తున్నానని మిషెల్‌ చెప్పారని ప్రకటన తెలిపింది. వచ్చే మంగళవారం వైట్‌హౌస్‌లో జరిగే విందుకు చిన్నారుల తల్లితండ్రులు, సంరక్షకులు హాజరవుతారని చెప్పింది.

ద హెల్తీ లంచ్‌టైమ్‌ చాలెంజ్‌ అండ్‌ ఎంప్‌ సంస్థ గత ఏడాది నుంచి ఈ పోటీలను నిర్వహిస్తుంది. అమెరికాలో 8 నుంచి 12 ఏళ్ల వయస్సు లోపు చిన్నారులకు ఆరోగ్యకరమైన వంటల పోటీని నిర్వహించి వారికి బహుమతులు ప్రదానం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+