• search

అమెరికాలో తెలుగు మహిళా దినోత్సవం

By Pratap
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  వాషింగ్టన్: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భం గా , అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యం లో "ఆట మహిళా దినోత్సవం" మార్చ్ నెలలో, అమెరికాలోని ప్రముఖ నగరాల్లో వాషింగ్టన్ డి సి , న్యూజెర్సీ, న్యూ యార్క్ , ఫిలడెల్ఫియా నగరాల్లో, తెలుగు మహిళలు తరలి వచ్చి , ఆట ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. త్వరలో డల్లాస్ , చికాగో నగరాలలో తో పాటు ఇతర నగరాల్లో ఆట ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటారు.


  ప్రపంచ మహిళా దినోత్సవం, అమెరికాలో , వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న ఆట ఏకైక తెలుగు సంఘంగా నిలిచి "ఆటా" మహిళలపై తమకున్న గౌరవాన్ని, విశ్వాసాన్ని తెలియజేసింది. ప్రతి సంవత్సరం ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుతామని , మహిళల కోసం వినూత్నంగా " ఆటా ప్రపంచ మహిళా దినోత్సవం" నిర్వహిస్తునందుకు గర్వపడుతున్నామని ఆటా అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం తెలిపారు.

  Women's Day Celebrations by ATA

  ఆటా నాయకత్వం, స్వచంద కార్యకర్తలు , న్యాయవాదులు , వైద్యులు , రాజకీయ నాయకుల , సహాయ సహకారాలతో అమెరికాలో నివాసం ఉన్న తెలుగు మహిళలకు చట్టానికి లోబడి న్యాయపరమైన , వైద్య, ఆపదలో ఉన్న మహిళలకు సహాయం అందిస్తుంది.


  మహిళా ప్రముఖులను కలవటానికి , అభిప్రాయాలని వ్యక్తం చేయడానికి -పంచుకోవటానికి, తెలుగువాళ్ళతో స్నేహం చేయడానికి, ఆటా ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమము ఒక వేదికగా మారింది. ఆట ప్రపంచ మహిళా దినోత్సవం, తెలుగు మహిళా విజయగాధలు , తెలుగు యువతకు ప్రేరణ కలిగించే అంశాలు,మహిళా గుర్తింపు- అభినందన ,సంఘటిత సంస్థలలో విజయం సాదించిన మహిళలతో "ముఖా ముఖి", సంఘం లో మహిళలు ఎదుర్కున్న పరిస్థితులు, సాంఘిక సంస్థలలో మహిళల పాత్ర, సోషల్ మీడియా లో ప్రయోజనాలు,అమెరికా లో గృహహింస, ఆసక్తిని ప్రేరేపించే వివిధ అంశాలపై ద్రుష్టి కేంద్రికరించింది.

  మహిళ "ఉద్యోగము-కుటుంబము" రెండింటికీ సమంగా న్యాయం చేకూర్చడం ఎలా?, మహిళా- శాంతి , ఆరోగ్యమే మహాభాగ్యము , సాంఘిక సంస్థలలో నాయకరాలి గా ఎలా ఎదగాలి ?, అమెరికా లో పెరుగుతున్న తెలుగు పిల్లలు , పారిశ్రామిక వేత్తగా ఎలా ఎదగాలి ?, సాధికారత, ఆర్ధిక స్వాతంత్ర్యం, ఒత్తిడి ని తట్టుకోవడం ఎలా ? లాంటి అంశాలతో , ప్రముఖ మహిళలు తమ అనుభవాలను , సలహాలను తెలుగు మహిళలతో పంచుకున్నారు. ఆట ప్రపంచ మహిళా దినోత్సవాలలో , చరిత్రలోని ప్రముఖ తెలుగు మహిళల గురించి చిత్రీకరించిన "తెలుగు మహిళా లఘు చిత్రం " చాలా ఆకర్షించింది.

  వాషింగ్టన్ డిసి మెట్రో ఏరియాలో..

  ఈ కార్యక్రమాన్ని వాషింగ్టన్ డిసి ఏరియాలోని మహిళా నాయకులు సౌమ్య కొండపల్లి, జనిత కంచెర్ల, ముఖ్య అతిధులు జ్యోతిని వెలిగించి ప్రారంబించారు. తరువాత ముఖ్య అతిధులు మాట్లాడుతూ - వారి అనుభవాలను మరియు అభివృద్ధి చెందినట్టి విదానాన్న్ని మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా డిసి మెట్రో ఏరియాలోని విజయవంతమైన మహిళలను వారి వారి వృతి పరంగా గుర్తించి డాక్టర్ శ్యామల నారోజి, నీలిమ మెహర, సాయికాంత రాపర్ల , ప్రభ పాలెపు, రాధిక రాజేష్, ప్రతిభ పోలాప్రగడ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడ జరిగాయి.

  జ్యోతిర్మయీ చావాలి కూచిపూడి నృత్యం, యుతి మాదిరెడ్డి వయోలిన్ , రశ్మి బొజ్జ, లీన కేతు డాన్సు పెర్ఫార్మన్స్ తో అందరిని అలరించారు. అలాగే వసుధార రెడ్డి అత్యంత ప్రముఖ మహిళల గురించి ఎన్నోక్విజ్ ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పిన వారికి బహుమతులు అందించారు. ఈ క్విజ్ ప్రోగ్రాంలో మహిళలు ఎంతో ఆసక్తితో పాల్గొని పోటాపోటీగా సమాధానాలు చెప్పారు.

  ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పలువురు మహిళలలు వేణి కొండపోలు, సంధ్య బొజ్జ, శ్రీమతి దీపిక బూజాల, పద్మ మాదిరెడ్డి, రజని పడురు, రోహిణి కతుకురి, ఇతర అటా నాయకులు రవి బొజ్జ, వెంకట్ కొండపోలు, శ్రీధర్ బాణాల,సౌమ్య కొండపల్లి, జనిత కంచెర్ల, రాజేష్ మాదిరెడ్డి భువనేష్ బూజల, రామ్మోహన్ కొండ, విశ్వేశ్వర్ కాల్వాల, మనోహర్ ఏనుగు, రవి పల్ల, లోకేష్ రెడ్డి కమిటి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నారు

  న్యూజెర్సీలో:

  ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భం గా , అమెరికన్ తెలుగు సంఘం (ఆట) ఆధ్వర్యంలో జమున స్వాగంత పలికారు. ఈ కార్యక్రమానికి   400 మందికి   స్వాగతం పలికింది. భారత యాక్టిగ్ కాన్సుల్ జనరల్ డాక్టర్ దేవయాని కొబ్రగాటే  జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిధులు డాక్టర్ దేవయాని , సునీత కుమారి, మాధవి ఆరువ, బ్రహ్మ కుమారి సంస్థ సిస్టర్ సంధ్య మాట్లాడుతూ- వారి అనుభవాలను, అభివృద్ధి చెందినట్టి విదానాన్న్ని మహిళలకు వివరించారు.

  ఈ సందర్బంగా హెఇఎల్పీ సంస్థ వ్యవస్థాపకురాలు మాధవి పోలేపల్లిని  సన్మానించారు. అద్బుత మైన ప్రదర్శనల ద్వారా లావణ్య  సతీష్, నిర్మల సిసట్ల, కవిత తోటకూర క్విజ్, గేమ్ షో నిర్వహించారు. జమున పుస్కూర్ , కలపన్ సువర్ణ, ,బిందు మాదిరాజు,భాని మాగంటి,అను దాసరి, అండ్ వరూధిని, కలపన్ సువర్ణ, సంగీత ధన్నపునేని, జ్యోతి ముత్యాల తెలుగు సినిమా ప్రదర్శన సభికులను ఎంతో ఆకట్టుకుంది. టిఎఫ్ఎఎస్ అధ్యక్షులు అంజలి, నాగమణి బహుమతులు అందించారు. ఆటా  నాయకులూ రఘువీర్ రెడ్డి , భగవాన్ పింగ్లె, జమున పుస్కూర్ ,రమేష్ మాగంటి, పరమేష్ భీమ రెడ్డి, ధర్మ కర్తలు, కమిటీ  చైర్స్ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు.


  ఫిలడేల్ఫియాలో:

  జానకి చింతపల్లి స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. అథితులను మాధవ మూసార్ల  సన్మానించారు. అతిథుల్లో ఒకరైన ఉజ్వల దిక్షిత్ సభికులను ఉద్దేశించి ప్రసంగిచారు. సమీర శ్రీపాద, మృదుల నడురుపాటి రకరకాల ప్రదర్శనల ద్వారా సభికులను ఉత్తేజపరిచారు. లీన కొల్లూరు, మాధవ కమతాల  కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

  ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పలువురు మహిళలలు సౌందర్య మేరెడ్డి, జానకి చింతపల్లి, స్రవంతి మదిపడగ, తోట భాను, లీన కొల్లూరు, మాధవ కమతాల, రజని అంకటి , నిర్మల మూసని , మృదుల కమతాల, ఆటా ఇతర నాయకులు వెంకట్ క్రిష్, గోవింద  చింతపల్లి, పరమేష్ భీమ రెడ్డి, మాధవ మూసార్ల , ఉదయ్ కొమ్మ రెడ్డి , కమల్ నేలుట్ల, మాధవ చిలక, జయన్ నల్లు,సురేష్ రెడ్డి వెంకన్న, సుదీర్ రాజు ,రాజ్ కక్కేర్ల,  ప్రశాంత్  గుడుగంట్లకు కమిటీ ధన్యవాదాలు తెలిపారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  International Women’s Day celebrations were held in United States of America in prominent cities (Washington DC Metro Region, Philadelphia – PA, New Jersey/New York, on 9th and 10th March 2014 and going to be celebrated in Dallas/Ft Worth, Chicago-IL and many more cities around the country in March.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more