అమెరికాలో ప్రముఖ తెలుగు వైద్యుడు అనుమానాస్పద మృతి
అమెరికాలో మరో తెలుగు వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరంశెట్టి రమేష్ బాబు అమెరికాలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. కార్ పార్కింగ్ షెడ్ వద్ద తుపాకీ పేలడంతో మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా దుండగులు హత్య చేశారా? అనే విషయాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
డాక్టర్ రమేష్ బాబు మేనకూరు ప్రభుత్వ పాఠశాలలో విద్య పూర్తయిన అనంతరం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. మెడిసిన్ కోర్స్ పూర్తయిన తర్వాత రమేష్ బాబు అమెరికాలో స్థిరపడ్డారు. అంతేగాక, అమెరికాలో పలుచోట్ల ఆస్పత్రులు నిర్మించి ఉపాధి కల్పించారు రమేశ్‌బాబు. టస్క్ లూసా ప్రాంతంలో వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రమేశ్‌బాబు సేవలకు గుర్తింపుగా అక్కడి వీధికి ఆయన పేరు పెట్టడం గమనార్హం.

భారత్ నుంచి అమెరికా వెళ్లే రాజకీయ ప్రముఖులకు తన ఇంట్లో ఆతిథ్యమిచ్చేవారు. అయితే డాక్టర్ రమేష్ బాబు మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రమేశ్‌బాబు తండ్రి ఓ రైతు. ముగ్గురు తోబుట్టువుల్లో పెద్దవాడైన రమేశ్‌బాబు పదో తరగతి వరకూ మేనకూరులో చదువుకున్నారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. జమైకాలో ఎంఎస్ పూర్తైన తర్వాత అమెరికా చేరుకుని అక్కడే వైద్యుడిగా స్థిరపడ్డారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరికి నలుగురు సంతానం కాగా ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు అంతా అక్కడే నిాసం ఉంటున్నారు.
కాగా, రమేశ్‌బాబు కరోనా సమయంలో గొప్ప సేవలందించి పురస్కారాలు అందుకున్నారు. డాక్టర్ రమేశ్ బాబు తాను చదువుకున్న ఉన్నత పాఠశాలకు గతంలో రూ.14 లక్షలు విరాళం ఇచ్చారు. స్వగ్రామంలో సాయిబాబా మందిర నిర్మాణానికి 20 లక్షల రూపాయలు కూడా అందించారు. ఆగస్టు 15న నాయుడుపేటలో బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొన్న రమేశ్ బాబు.. అంతలోనే మృతి చెందారని తెలియడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృస్వగ్రామంలో విషాద ఛాయలు అలుముున్నాయి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications