NRI News: బ్యాంకాక్ లో తెలుగు వ్యక్తి కిడ్నాప్..!

ఉద్యోగం కోసం వెళ్లిన వ్యక్తి కిడ్నాప్ గురయ్యాడు. ఈ ఘటన బ్యాంకాక్ లో జరిగింది. ఏపీలోని నంద్యాల వాసిని గుర్తు తెలియని దుండగులు బ్యాంకాక్‌లో కిడ్నాప్ కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మధును కిడ్నాప్ చేసినట్లు కుటుంబసభ్యులకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తిని విడిచి పెట్టాలంటే రూ.8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మధు ఫోన్ స్విచాఫ్ వస్తున్న కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి బెంగుళూరు నుంచి బ్యాంకాక్ వెళ్తున్నట్టు మధుకర్ కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆ తర్వాత బ్యాంకాక్ వెళ్తున్నట్లు చెప్పాడు. జులై 24న బెంగళూరు నుంచి బ్యాంకాక్ వెళ్లాడు. తనను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, 8 లక్షలు ఇస్తే వదులుతామంటున్నారని 25న మధుకుమార్ తన అక్కకు సందేశం పంపాడు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నార అక్క రాజ్యలక్ష్మికి మెసేజ్ పంపాడు.

A Telugu man from Nandyala district of AP was kidnapped in Bangkok

దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో డోన్ పోలీసులు దర్యాప్తు చేశారు. మధు పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలోనూ పోలీసులు విచారిస్తున్నారు. మధు కుమార్ బ్యాంకాక్‌కు వెళ్లాడా లేదా.. అన్న వివరాలు ఎయిర్ పోర్ట్ అధికారులను పోలీసులు కోరారు. ఎయిర్‌పోర్టు అధికారుల సమాచారం కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. మధు స్వగ్రామం నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్న మల్కాపురం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+