వేసవిలో వెళ్లి అనంతలోకాలకు

ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన నారయణ రెడ్డి, సుజాతలు ఉద్యోగరీత్యా ఒమన్ దేశంలో ఉంటున్నారు వీరి కుమారుడు సందీప్ రెడ్డి (22) చికాగోలో ఎంఎస్ చేస్తున్నాడు. వారాంతపు సెలవులు గడిపేందుకు అతని బాబాయ్ శ్రీనివాసులు రెడ్డి నివాసం ఉంటున్న డెలావేర్ స్టేట్‌లోని విల్‌మిల్టన్ సిటీకి వెళ్లాడు.
సెలవుల్లో శ్రీనివాసులు రెడ్డి, అతని మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి సందీప్ రెడ్డి ఆదివారం సాయంత్రం జలపాతం వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడిన సందీప్‌రెడ్డిని రక్షించేందుకు శ్రీనివాసులు రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
కోమాలోకి వెళ్లిన సందీప్ రెడ్డిని అక్కడి వైద్యశాలలో చేర్చారు. చికిత్స పొందుతూ అనతు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సందీప్ రెడ్డి విజయవాడ కెఎల్ విశ్వవిద్యాలయంలో బిటెక్ చెసి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు.












Click it and Unblock the Notifications