NRI News: కెనడాలో అనుమానాస్పద స్థితిలో భారతీయ మహిళ మృతి..!
కెనడాలో 19 ఏళ్ల వాల్‌మార్ట్ ఉద్యోగి, భారతీయ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయాన్ని ఆమె తల్లి వెల్లడించారు. అక్టోబర్ 19న వాల్‌మార్ట్ బేకరీలో గుర్సిమ్రాన్ కౌర్ అనే మహిళ వాల్ మార్ట్ స్టోర్ బేకరీ డిపార్ట్ మెంట్ వాక్ ఇన్ ఓవెన్ లో శవమై కనిపిచింది. మహిళను కాల్చిచంపినట్లు వార్తలు వస్తున్నాయి. 6990 మమ్‌ఫోర్డ్ Rd. వద్ద ఉన్న వాల్‌మార్ట్ నుంచి రాత్రి 9:30 గంటలకు ఫోన్ వచ్చినట్లు హాలిఫాక్స్ ప్రాంతీయ పోలీసులు తెలిపారు. అక్కడి వెళ్లి స్టోర్ బేకరీ డిపార్ట్‌మెంట్‌లోని పెద్ద వాక్-ఇన్ ఓవెన్ లోపల ఒక యువతి మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. వాల్ మార్ట్ లో కౌర్ తో పాటు ఆమె తల్లి రెండేళ్లుగా పని చేస్తున్నారు.
ఆ రోజు అనగా శనివారం సాయంత్రం తన కుమార్తె కనిపించకపోవడంతో కౌర్ తల్లి ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. ఆమెకు కాల్ చేయడానికి ప్రయత్నించారు, కానీ స్పందన రాలేదు. కౌర్ కోసం గాలించగా.. పెద్ద వాక్-ఇన్ ఓవెన్ లోపల పడి ఉంది. గుర్సిమ్రాన్ కౌర్ కొద్ది రోజుల క్రతమే ఇండియా నుంచి కెనడాకు వెళ్లినట్లు తెలిసింది. పోలీసులు వాల్ మార్ట్ షాపును మూసివేశారు. గుర్సిమ్రాన్ కౌర్ మరణానికి గల కారణలను దర్యాప్తు చేస్తున్నారు.

కౌర్ అంత్యక్రియల కోసం నిధులు సేరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కుటుంబానికి మద్దతుగా నిధుల సమీకరణ $75,000 కంటే ఎక్కువ కెనడియన్ డాలర్లు వచ్చినట్లు సమాచారం. సిక్కు మహిళ మృతికి సంబంధించిన న్యూస్ స్థానిక సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం జరిగింది. అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని స్థానిక పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కౌర్ తండ్రి, సోదరుడు ఇండియాలోనే ఉన్నారు. తదుపరి నోటీసు వచ్చేవరకు స్టోర్ మూసివేస్తామని వాల్ మార్ట్ పేర్కొంది.
కాగా భారత్, కెనడా మద్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతోన్నాయి. ఇప్పటికే ఇండియాకు చెందిన దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. నిజ్జర్ హత్యకేసు విషయంలో భారత ప్రభుత్వ వైఖరిని కెనడాకు బలంగా వినిపించింది. అయినప్పటికీ ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీశాయి.












Click it and Unblock the Notifications