సిడ్నీలో వైభవంగా బతుకమ్మ సంబరాలు
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బతుకమ్మ, దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్(ఎస్‌బీడీఎఫ్), ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం(ఏటీఎఫ్) ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సిడ్నీ దుర్గా ఆలయం ఆడిటోరియంలో నిర్వహించిన బతుకమ్మ ఆటా-పాటతో సిడ్నీ నగరం పూలజాతరతో పరవశిచింది.

నిర్మలా ఓ నిర్మలా..
నిర్మలా ఓ నిర్మలా ఓ నిర్మలా అంటూ బతుకమ్మ ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. సప్తవర్ణాల శోభితమైన పూలదొంతరల బతుకమ్మలు చూడముచ్చటేశాయి. వాటి తయారీకి ఉదయం నుంచే కష్టపడ్డారు మహిళలు. ఉత్తమ బతుకమ్మలను నిర్వాహకులు ఎంపిక చేశారు. వాటిని తయారు చేసిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు.

భావి తరాలకు మన సంస్కృతి
సిడ్నీ బతుకమ్మ చైర్మన్ అనిల్ మునగాల.. తెలంగాణకు ఎన్నారైలు వేల మైళ్ల దూరంలో ఉంటున్నా మనసుంతా తెలంగాణపైనే ఉంటుందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను , ఆచార వ్యవహారాలను పాటిస్తుండటం ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లలకు కూడా తెలంగాణ సంస్కృతిని తెలియజెప్పడమే సంస్థ ముఖ్య ఉదేశ్యమని తెలిపారు

వైభవంగా బతుకమ్మ ఆటాపాట
వైభవంగా జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆడపడుచులు రంగురంగుల తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పాటలు పాడి ఆడారు. బతుకమ్మ ఆటపాటలతో పరిసరాలు మార్మోగాయి. అందరూ ఒక్కచోట కూడి ఇలా బతుకమ్మను వేడుకగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎస్‌బీడీఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తోతుకుర్ అన్నారు.

బతుకమ్మ సంబరాలు
ఈ బతుకమ్మ సంబురాల్లో సుమారు 1700 నుండి 2000 మంది వరకు ప్రవాసులు పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నేత ఇనుగుల పెద్ది రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ జానపద గాయినీ వాణి వోలోలా తన బతుకమ్మ పాటలతో అందరిని ఆకర్షించారు. తెలంగాణ జానపద గీతాలతో సురేందర్ మిట్టపల్లి జనాలను ఊర్రూతలూగించారు.

ఇతర రాష్ట్రాల వారు కూడా..
ప్రవాస తెలంగాణవాసులే కాకుండా.. పంజాబీలు, చైనీయులు, తమిళులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా పాల్గొని బతుకమ్మ వేడుకలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. ఈ వేడుకల్లో కోలాటం, ప్రత్యేక దాండియా షో, జమ్మి పూజ, శివ గర్జన డ్రమ్స్, బతుకమ్మ స్పెషల్ లేజర్ షో, స్పెషల్ ఫోక్ బ్యాండ్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరు.

విజయవంతంగా సంబరాలు
సిడ్నీ బతుకమ్మ ప్రధాన కార్యదర్శి అశోక్ మాలిష్ వందన సమర్పణ చేస్తూ.. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి స్పాన్సర్స్, కమూనిటీ పార్ట్నర్స్, మీడియా పార్ట్నర్స్, వాలెంటీర్స్, అడ్వయిజరీ బోర్డు, సమన్వయకర్తలు, ప్రదీప్ రెడ్డి సేరి, గోవెర్దన్ రెడ్డి ముద్దం, వినయ్ కుమార్ యమా, ప్రాశాంత్ కుమార్ కడపర్తి, చేసిన కృషి కారణమన్నారు. ఈ కారిక్రమంలో రామ్ రెడ్డి గుమ్మడివాలి, కిషొర్ యాదవ్, సునీల్ కల్లూరి, మిథున్ లోక, ప్రదీప్ తెడ్ల, , శశి మన్నెం, కిషొర్ రెడ్డి పంతులు, నటరాజ్ వాసం, డేవిడ్ రాజు, ఇంద్రసేన్ రెడ్డి, పాపి రెడ్డి, నర్సింహా రెడ్డి, ప్రమోద్ రెడ్డి ఏలేటి, కిరణ్ అల్లూరి, ఇతర సంగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications