ఇండియన్ స్టూడెంట్స్ కి బ్రిటన్ యూనివర్సిటీ బెస్ట్ ఆఫర్..
బ్రిటన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత కింగ్స్ కాలేజ్ భారతీయ విద్యార్థులకు తీపి కబురు ప్రకటించింది. తమ విద్యాసంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు దరఖాస్తు చేసుకునే ప్రతిభావంతులైన భారతీయులకు వైస్ ఛాన్స్‌లర్ పురస్కారం కింద 10,000 పౌండ్ల ఫీజును రద్దు చేస్తామని వెల్లడించింది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.11,26,000 తగ్గించడం అంటే పెద్ద విషయమే అని సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కింగ్స్ కాలేజీ గతేడాది ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ సంవత్సరం దాదాపు 30 మంది అర్హులైన భారతీయ విద్యార్థులకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి పీజీ కోర్సులు మొదలు కానున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ విద్యార్థులు ఏప్రిల్ చివరికల్లా దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం కోరుతుంది. ఇక ఈ అవార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ విద్యార్హతలు, కింగ్స్ కాలేజీలో విద్యాభ్యాసం ద్వారా చేయనున్న సేవలను వెల్లడించాల్సి ఉంటుంది.

ఇక ఈ కాలేజీలో వైస్-ఛాన్సెలర్ గా ప్రొపెసర్ శిజిత్ కపూర్ పనిచేస్తున్నారు. ఆయన భారత్ కు చెందిన వ్యక్తి. ఈ సందర్బంగా ఈ అవార్డుల ప్రాముఖ్యతను, భారతీయ విద్యార్థులకు ప్రోత్సాహకాన్ని అందజేయడం గల కారణాన్ని వెల్లడించారు. విదేశాలలో ఉన్నత చదువుల కోసం తాను ఢిల్లీ నుంచి లండన్‌కు వచ్చినట్టు చెప్పారు. ఈ కాలేజీలోని పూర్వ విద్యార్థుల్లో స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజిని నాయుడు ఒకరని పేర్కొన్నారు.
అలానే ఆయన మాట్లాడుతూ.. యూకేలో బెంగాలీ, సంస్కృతం బోధించిన యూనివర్సిటీల్లో కింగ్స్ కాలేజీ ఒకటని ప్రస్తావించారు. అయితే భారతీయ దరఖాస్తుదారుల సంఖ్య పెరుగుతున్నా.. ట్యూషన్ ఫీజులు చాలా మందికి భారంగా మారాయని అన్నారు. అందుకే ఎక్కువ మంది విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ ఆఫర్ తీసుకొచ్చినట్టు తెలిపారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications