గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికే ఆదర్శం : మహేష్ బిగాల
భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తెలంగాణ లోనే కాకుండా దేశ విదేశాలకు విస్తరించింది. బీఆరెస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణానికి రాజ్యసభ సభ్యులు శ్రీ.జోగినపల్లి సంతోశ్ కుమార్ చేస్తున్న కృషి అందరికి స్ఫూర్తివంతంగా నిలుస్తోందన్నారు.
ఎక్కువమంది రాజకీయ నాయకులు సంక్షేమం, అభివృద్ధి , ప్రజల ప్రయోజనాలపై దృష్టి పెడతారని, కానీ అన్ని బాధ్యతల కన్నా సామాజిక బాధ్యత మిన్న అని, సమస్త మానవజాతి మనుగడకు మొక్కలే జీవనాధారమని, మొక్కలను పెంచడం ద్వారా పచ్చదనం పెరిగి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు జాన్ కెర్రీ వాతావరణ మార్పు కోసం US ప్రత్యేక అధ్యక్ష ప్రతినిధిగా నియమించబడ్డారు అంటేనే పర్యావరణ పరిరక్షణ ఎంత గొప్పదో అర్ధమవుతోందన్నారు.

సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రచారంలో ప్రత్యేక ప్రతినిధి కావడం విశేషం. కేసీఆర్ పేరు భవిష్యత్ తరాలకు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన చేసిన కృషికి ఎంపీకి అందరి ఎన్నారైల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. సమిష్టి కృషి, సామాజిక స్పృహకు ఈ కార్యక్రమం నిలువెత్తు నిదర్శనమని, లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు చోటు లభించడం హర్షణీయం అన్నారు.
దేశంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతిఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అనే ముఖ్య ఉద్దేశంతో 2018, జూలై 17న జోగినపల్లి సంతోష్ కుమార్ 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేడ్చల్ జిల్లాలోని 2,042 ఎకరాల్లోని కీసర రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకున్నారు.












Click it and Unblock the Notifications