NRI News: లండన్ స్థిర ఆస్తుల్లో అగ్రస్థానంలో నిలిచిన భారత సంతతి వారు..!
ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయని చెబుతుంటారు. అవును ఇది అక్షర సత్యం.. 200 సంవత్సరాలు ఇండియాను బ్రిటిష్ వాళ్లు పరిపాలించారు. కానీ ఆ తర్వాత భారత సంతతి వ్యక్తే బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఇది పక్కన బెడితే.. లండన్ లో మాత్రం భారత సంతతి వారి హవా సాగిస్తున్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్న వారిలో భారతి సంతతి వారే అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. దశాబ్దాల క్రితం అక్కడి వెళ్లిన భారతీయులు, ఇండియన్ ఇన్వెస్టర్లు, చదువు కోసం వెళ్లి అక్కడ స్థిరపడిన వారు భారీగా స్థిర ఆస్తులు కొనుగోలు చేశారని తెలుస్తోంది.
లండన్‌లో రియల్ ఆస్తులున్న వారి మొదటి స్థానం భారత సంతతి వారిదని చెబుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రిటన్ జనాలు, పాకిస్థానీలు ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని బారెట్ లండన్ అనే సంస్థ నివేదిక రూపొందించింది. చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇండియా నుంచి దొచుకెళ్లిన సంపద అంతా రికవరీ చేయాలని కామెంట్ చేస్తున్నారు. బ్రిటిష్ వారు అన్యాయంగా మన సంపదను దొచుకుంటే మనోళ్లు న్యాయపరంగా అక్కడ సంపాదించారని మరొకరు కామెంట్ చేశారు.

అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని మరొకొందరు కామెంట్ చేశారు. మనం పాపం చేస్తే ఇదే జన్మలోనే.. ఖర్మ అనుభవిస్తామని మరొకరు చెప్పారు. చాలా మంది డబ్బులున్నాయి కదా అని ఇష్టమొచ్చినట్లు చేస్తారు.. పైన ఒకడుంటాడని.. అన్ని సరి చేస్తాడని.. కానీ దానికి టైమ్ పడుతుందని మరొకరు కామెంట్ చేశారు. ఒకానొక సమయంలో ప్రపంచంలో సగం వారి సొంతమైతే.. ఇప్పుడు లండన్‌లో సగం కూడా భారతీయుల చేతుల్లోకి వచ్చిందని చెబుతున్నారు.
ఇప్పటికీ కూడా లండన్ వెళ్లే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. భారతీయులు అమెరికాతో పాటు లండన్ ఎక్కువ వెళ్తున్నారు. భవిష్యత్ లో లండన్ లో ఎక్కవగా భారత సంతతి వారు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications