నిప్పుపెట్టి భర్త హత్య: ఎన్నారైకి జీవిత ఖైదు

Indian woman accused of killing husband in US faces life term
హుస్టన్: రెండు సంవత్సరాల క్రితం తన భర్తకు నిప్పు పెట్టి హత్య చేసిన కేసులో అమెరికాలో నివాసం ఉంటున్న భారతదేశానికి చెందిన మహిళకు అక్కడి న్యాయస్థానం జీవిత ఖైదును విధించింది. మార్చి 4న ఆస్టిన్, టెక్సాస్‌లలో హత్య కేసులో న్యాయవాదులు తమ వాదనలను కోర్టు ముందు వినిపించారు. నిందితురాలు శ్రేయా పటేల్ తన భర్తను బాత్ రూంలో మసాజ్ చేస్తానని చెప్పి, అతనిపై గ్యాసోలిన్ పోసి నిప్పటించిందని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

2012, ఏప్రిల్ 17న ఘటన జరుగగా సుమారు ఐదు నెలలపాటు శాంటానియాలోని మిలిటరీ మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతూ.. తీవ్ర గాయాల కారణంగా ఆమె భర్త బిమల్ పటేల్ (29) తనువు చాలించాడని చెప్పారు. న్యాయవాదుల వాదనలను విన్న కోర్టు నిందితురాలికి జీవిత ఖైదును విధించింది. శుక్రవారం నుంచి శిక్ష అమలులోకి రానుందని కోర్టు తెలిపింది.

ఉత్తర ఆస్టిన్‌లోని పటేల్ నివాసంలో జరిగిన ఈ హత్య కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపారు. హత్య సమయంలో ప్లాస్టిక్ బ్యాగ్స్, గ్యాసోలిన్ ఉన్న బకెట్లపై నిందితురాలు శ్రేయా పటేల్ వేలిముద్రలను పోలీసులు గుర్తించారు. నేరం రుజు కావడంతో నిందితురాలికి పేరోల్ లేకుండానే శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, రెండు సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసులో గత నెల వరకు కూడా దర్యాప్తు జరపని పోలీసులు, అత్యవసరంగా విచారణ చేపట్టి గత మంగళవారం డిఎన్ఏ ఆధారాలను కోర్టుకు సమర్పించారని నిందితురాలి తరపు న్యాయవాది చెబుతున్నారు. నిందితురాలి భర్త తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకు ఆమె సహాయాన్ని కోరాడని చెప్పారు. ప్రాసిక్యూటర్ మాత్రం శ్రేయా పటేల్ ఆమె భర్తను గ్యాసోలిన్ పోసి నిప్పంటించి హత్య చేసిందని కోర్టుకు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+