ఎన్నారై లీల: నిశ్చితార్థం చేసుకుని పెళ్లి ఎగ్గొట్టాడు

హైదరాబాద్: కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ ఎన్నారై పత్తా లేకుండా పోయాడు. నిశ్చితార్థం చేసుకుని పెళ్లి తేదీ దగ్గరపడినా అతను ఎక్కుడున్నాడనేది తెలియలేదు.

పెళ్లి కొడుకు జాడ తెలియక పెళ్లి కూతురు నిద్రమాత్రలు మింగింది. అదిలాబాద్‌ జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావు కుటుంబంతో హైదరాబాదులోని మధురానగర్‌లో నివాసముంటున్నారు. రెండో కుమార్తె జావళిని నిజామాబాద్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ నవనీత్‌రాజుకు ఇచ్చి వివాహం చేయాలని రెండు నెలల క్రితం నిశ్చయించారు.

జావళిని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని నవనీత్‌రాజు చెప్పాడు. ఈ మేరకు మార్చి 22న ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 14న వివాహం తేదీ నిర్ణయించారు. పెళ్లి కూతురు బీటెక్‌ చదివిందని ఆమె తల్లిదండ్రులు పెళ్లి చూపుల సమయంలో నవనీత్‌ రాజుకు చెప్పారు.

NRI avoids wedding after engagement with a girl

కొద్ది రోజుల తరువాత జావళి చదువు విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో జావళిని పెళ్లి చేసుకోనని చెప్పి నవనీత్‌ రాజు అమెరికా వెళ్లిపోయాడు. కాని జావళి కుటుంబ సభ్యులు మాత్రం ఆహ్వాన పత్రికలు అచ్చు వేయించి 14న పెళ్లి అని బంధు మిత్రులకు చెప్పారు. నవవీత్‌ రాజుకు కూడా చెప్పారు.

పెళ్లి తేదీ దగ్గర పడుతున్నా నవనీత్‌ రాజు రాకపోవడంతో వేదనకు గురైన జావళి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి ఆ తరువాత అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రి సిబ్బంది సంజీవరెడ్డి నగర్‌ పోలీసులకు సమాచారం అందించారు.

నవనీత్‌ రాజు అమెరికా నుంచి రానందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు ఆమె పోలీసులకు వాగ్మూలం ఇచ్చింది. ఎన్‌ఆర్‌ఐ మోసం చేసినట్లు యువతి తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.

ఖండించిన వరుడి తల్లిదండ్రులు

తమ పైన వచ్చిన ఆరోపణలను వరుడు నవదీప్ రాజు తల్లిదండ్రులు ఖండించారు. వధువు ఇంజినీరింగ్ పూర్తి కాలేదని పెళ్లి రద్దు చేసుకున్నామన్నారు. తమ అబ్బాయి ఇంకా అమెరికా నుండి రాలేదని, డబ్బులు ఎలా డిమాండ్ చేస్తామన్నారు. వధువు బీటెక్ చేసిందని అబద్దం చెప్పారన్నారు. తన తండ్రికి నెలనెలా డబ్బులు పంపాలని వధువు బ్లాక్ మెయిల్ చేసిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+