NRI News: ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్న కరీంనగర్ జిల్లా వాసి..!

అతను పుట్టింది పల్లెలో కానీ.. ప్రపంచస్థాయికి ఎదిగాడు. ఫోర్బ్స్ లిస్ట్ లో అఫీషియల్ ఎగ్జిక్యూటివ్ గా చోటు దక్కించుకున్నాడు. అతనే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన ఎన్ఆర్ఐ చింతం నరేందర్. నరేందర్ ప్రపంచ వ్యాప్తంగా 160 పైగా విద్యకు సంబంధించి జర్నల్స్ రాశారు.

అతనికి ఢిల్లీ ప్రభుత్వం పిల్లర్‌ ఆఫ్‌ ది నేషన్‌ అవార్డు ఇచ్చింది. చింతం రాములు-కనకలక్ష్మి దంపతుల కుమారుడు చింతం నరేందర్‌ గ్రామంలోనే ప్రాథమిక విద్య చదువుకున్నాడు. ఎల్ఎండీ కాలనీలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. కరీంనగర్ లో ఇంటర్ డిగ్రీ పూర్తి చేశాడు. హైదరాబాద్ లో ఎంబీఏ చదివాడు.

NRI Narendar from Karimnagar district has got a place in the Forbes list as an official executive

ఆ తర్వాత బెంగళూర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉద్యోగం పొందాడు. ఉద్యోగంలో భాగంగా అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత ఇటలీ, జర్మనీ, లండన్, స్కాట్ లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్ వెళ్లాడు. 2015 నుంచి అమెరికాలో స్థిరపడ్డారు. నరేందర్ అమెరికాలో 55 కీలక అంశాలపై రీసెర్చ్‌ చేసి ఇన్నోవేటివ్‌ పేటెంట్లు ప్రచురించాడు. కాన్ఫరెన్సులకు కీనోట్ స్పీకర్ గా వ్యవహరించాడు. ప్రపంచస్థాయి జర్నల్‌ సంస్థలకు చీఫ్‌ ఎడిటర్‌గా పని చేశాడు.

160 ప్రపంచస్థాయి జర్నల్‌ ప్రచురించారు. నరేందర్ విద్యాసంస్థల టెక్నికల్‌ కమిటీ మెంబర్‌గా కూడా పనిచేస్తున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇటీవల చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా నరేందర్ కు పట్టా అందజేసింది. నరేందర్ ఎలక్ట్రానిక్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌ కంపెనీలో సీనియర్‌ ఎంటర్‌ఫ్రైస్‌ ఆర్కిటెక్ట్‌ చోటు దక్కించుకున్నాడు. తాజాగా ఫోర్బ్స్‌ జర్నల్‌లో అఫీషియల్‌ ఎక్జిక్యూటీవ్‌గా చోటు సాధించాడు.

కొద్ది రోజుల క్రితం ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ శ్రీరాం నివాస్ గోయల్ నరేందర్ కు పిల్లర్ ఆఫ్ ది నేషన్ అవార్డు ప్రదానం చేశారు. మక్తపల్లికి నుంచి ప్రపంచస్థాయికి ఎదిగిన నరేందర్ ను చూసి వారి గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+