‘త్వరలో ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆస్ట్రేలియా శాఖ’

సిడ్నీ: క్షేత్రస్థాయిలోనే కాకుండా ఖండాంతరాల్లో నివసిస్తున్న తెలంగాణా బిడ్డలు సైతం తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీలో చేరి, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వాన్ని బలపర్చడానికి ముందుకు వస్తున్నారని టిఆర్ఎస్ ఎన్నారై సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.

నాడు ఉద్యమంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. నేడు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా చేయడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. మన ఇంటి పార్టీ టిఆర్ఎస్‌ని మనం కాపాడుకోవాలని, అన్ని సందర్భాల్లో వీలైనంత సహాయ సహకారాలు అందించడానికి ముందుండాలని అన్నారు.

కాగా, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలు ముందుకు వచ్చారని, కాబట్టి త్వరలో ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ఆస్ట్రేలియా విభాగం ప్రారంభమవుతుందని అనిల్ కూర్మాచలం తెలిపారు.

NRI TRS Cell will establish soon

అలాగే కేసీఆర్ ఆదేశానికి, టిఆర్ఎస్ ఎంపీ కవిత ప్రోత్సాహం మేరకు తెలంగాణా బిడ్డలు
ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడ ఎన్నారై టిఆర్ఎస్ శాఖలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి-ప్రవాస బిడ్డలకు వారధిగా నిలబడతామని చెప్పారు. [email protected]. ద్వారా తమను సంప్రదించవచ్చని తెలిపారు.

త్వరలో కమిటీ వివరాలు తెలియజేస్తామని, ఆవిర్భావ సభను కూడా ఘనంగా నిర్వహిస్తామని అనిల్ కూర్మాచలం తెలిపారు. అలాగే ఈ సందర్భంగా ఎన్నారైలకు అవకాశం కల్పించినందుకు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్‌కు, పార్టీ సభ్యత్వం తీసుకున్న ఎన్నారైలకు కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+