కువైట్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య వేడుకలు
కువైట్ సిటీ: కువైట్లో భారత రాయభారి కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత రాయబారి జీవసాగర్ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.
అనంతరం అందరికి శుభాకాంక్షలు తెలియచేసి.. భారత రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. తెలుగు దేశం కువైట్, తెలుగు సేవా సమితి అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావుపాటు, పీఆర్ఓ మద్దిన ఈశ్వర్ నాయుడు, అధికార ప్రతినిధులు సుబ్బారెడ్డి మరియు భాషా, సంక్షేమ కార్యదర్సి గూదే నాగార్జున, మద్దిన వెంకటెష్, గడికోట కోటి తదితరులు పాల్గొన్నారు.

కువైట్లోని తెలుగు సంఘాల ఐఖ్య వేదిక కన్వీనర్ సుధాకర రావు గారి ఆధ్వర్యంలో కార్యక్రమానికి విచ్చేసిన భారతీయులకు అల్పాహారాన్ని తాగునీటిని అందచేశారు. వివిధ తెలుగు సంఘాల అధ్యక్షులు పగడాల అంజన్ కుమార్, పెరుగు ప్రభాకర్ యాదవ్, చోటు తదితరులు పాల్గొన్నారు.


















Click it and Unblock the Notifications