మహిళల డ్యాన్స్: లండన్ ఎన్నారైలు బోనాలెత్తారు
లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి సుమారు 500లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరైయ్యారు. స్వదేశం లో జరుపుకున్నట్టు సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీదుల్లో తొట్టెల ఊరేగింపు ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్థానికులని కూడా ముగ్దులని చేసింది
ఈ సంవత్సరం జరుపుకొనే పండగకు ప్రత్యేకత ఉందని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుపుకుంటున్న మొదటి పండగ కావడం అలాగే తెలంగాణ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండగగా గుర్తించడం కొత్త ఉత్సాహాన్ని, స్పూర్తి ని ఇచ్చాయని కమిటీ సబ్యులు, హాజరైన ప్రవాస తెలంగాణ బిడ్డలు తెలిపారు.

తెలంగాణ చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమం అందరిని అలరించింది, ముఖ్యంగా కమిటీ మహిళా విభాగం సభ్యులు చేసిన తెలంగాణ జానపద నృత్యం హైలైట్ గా నిలిచింది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కోసం నిర్వహించిన రాఫెల్‌లో అందరు పాల్గొని విజేతలు బంగారం, వెండి బహుమతులు గెల్చుకున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ జ్ఞాపిక లతో ప్రశంశించారు.
సంప్రదాయ తెలంగాణా వంటకాలతో పండగ భోజనం సొంత ఇంటిని తల్పించందని పలువురు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం పట్ల, తెలంగాణ గవర్నర్ కి అదనపు బాద్యతలు ఇవ్వడం పట్ల ప్రవాస తెలంగాణ బిడ్డలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.తెలంగాణ ఎన్నారై ఫోరం అద్యక్షులు సిక్కా చందు గౌడ్, ఉపాధ్యక్షులు పవిత్ర రెడ్డి కంది ఆధ్వర్యం లో జరిగిన బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషంగా ఉందని తెలిపారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యులు అనిల్ కూర్మాచలంతో పాటు ప్రధాన కార్యదర్శి సుమన్ బాల్మురి, సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, గోలి తిరుపతి, ఈవెంట్స్ ఇంచార్జ్ ప్రమోద్, ఈవెంట్స్ సెక్రటరీ నగేష్ రెడ్డి, కల్చరల్ సెక్రటరీ మీనాక్షి, అడ్వైజరీ బోర్డు సభ్యుడు ఉదయ నాగరాజు, మీడియా ఇంచార్జ్ శ్రవణ్ రెడ్డి, మహిళా విభాగం సభ్యులు సుమ, స్వాతి, వాని, నిర్మల,శ్వేతా,శుశుమ్న, హేమ, సుహాసిని, ఇతర కమిటీ సభ్యులు సుధాకర్,అశోక్ గౌడ్,నవీన్ రెడ్డి,చిట్టి వంశీ, మల్ల రెడ్డి, విక్రం రెడ్డి, నరేష్, రంగు వెంకట్, ప్రసాద్ తోట, శివాజీ షిండే, గోలి సుమన్ తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications