లండన్‌లో ఇద్దరు తెలుగు యువకులు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం.. ఆ కారణం వల్లే !
వినాయక నిమజ్జన కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా.. రోడ్డు ప్రమాదం చోటు చేసుకొని హైదరాబాద్ కి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అలానే మరో ఐదుగురు యువకులకు తీవ్రంగా గాయలైనట్టు తెలుస్తోంది. ఈ విషాద ఘటన లండన్ లో జరగగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ప్రమాదం ఎలా జరిగిందంటే..?
లండన్‌లో తెలుగు యువత ఘనంగా వినాయక ఉత్సవాలను నిర్వహించారు. కాగా వినాయక నిమజ్జనం కోసం ఆ తరువాత 8 మంది స్నేహితులు రెండు కార్లలో కలిసి బయల్దేరారు. నిమజ్జనం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఆ రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే చైతన్య, రిషి తేజ మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

మృతుల వివరాలు..
ఈ ప్రమాదంలో తర్రె చైతన్య యాదవ్ (23), రిషితేజ (21) అక్కడికక్కడే మృతిచెందారు. వారి మరణ వార్తతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చైతన్య యాదవ్ నాదర్‌గుల్‌కు చెందిన తర్రె ఐలయ్య, మంగమ్మల చిన్న కుమారుడు. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన అతను.. ఉన్నత విద్య కోసం 7-8 నెలల క్రితం లండన్‌కు వెళ్లాడు. అలానే రిషి తేజ కూడా ఉప్పల్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇరువురు అక్కడ చదువుతూ ఉండగా స్నేహితులతో కలిసి వినాయక ఉత్సవాల్లో పాల్గొన్నారు. వేడుకల నేపధ్యంలో ఈ తరహా విషాదం జరగడం పట్ల యువకుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
వినాయక ఉత్సవాలు ఆనందంగా జరుపుకున్న తర్వాత జరిగిన ఈ రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదం నింపుతోంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా గాయపడిన మిగతా యువకుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications