NRI News: మహిళలకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం.. కెమెరాల్లో రికార్డ్.. ఎన్నారై దారుణం..!

ఆస్ట్రేలియాలో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఐదుగురు కొరియన్ మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడమే కాక అత్యాచార దృశ్యాలను కెమెరాలో చిత్రీకరించినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదించింది. భారత సంతతి కమ్యూనిటీలో మంచి పేరున్నబాలేష్ ధంఖర్ 2018 జనవరి నుంచి అక్టోబర్ మధ్య జరిగిన 13 అత్యాచారాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సిడ్నీ కోర్టులో జ్యూరీ అతన్ని దోషిగా నిర్ధారించారు.

బాలేష్ ధంఖర్ గతంలో భారత్ లోని ఓ రాజకీయ పార్టీకి పని చేశాడు. కొరియన్ సినిమాలు, భాష, మహిళల పట్ల ఆకర్షితుడైన అతను.. ఆ క్రమంలోనే 2017లో కొరియన్ అనువాదకులు కావాలంటూ ఒక ఉద్యోగ ప్రకటన ఇచ్చాడు. ఒంటరిగా, కొత్తగా సిడ్నీకి వచ్చే కొరియన్ యువతులకు అతను మాయమాటలు చెప్పి ముగ్గులోకి దించేవాడు. వారిని విందు రావాలంటూ కోరేవాడు. విందుకు వచ్చిన వారికి వైన్, ఐస్ క్రీమ్ లో డ్రగ్స్ కలిపి ఇచ్చేవాడు. యువతులు స్పృహ తప్పగానే వారిపై అత్యాచారం చేశాడు. వాటిని రికార్డు కూడా చేసేవాడు. కెమెరాలను బెడ్ సైడ్ అలారం క్లాక్ పెట్టి రికార్డ్ చేసేవాడు.

drugs

అక్టోబర్ 2018లో పోలీసులు ధంఖర్ అపార్ట్‌మెంట్‌లో సోదా చేసినప్పుడు, అతను మహిళలతో లైంగిక చర్యలో పాల్గొన్న 47 వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. వీడియోల్లో కొందరు యువతులు అపస్మారక స్థితిలో ఉన్నారని.. మరికొందరు వేదనలో ఉన్నట్లుగా కష్టపడుతున్నారు పోలీసులు తెలిపారు. వీడియోలను దాచి పెట్టిన ఫోల్డర్లకు కొరియన్ మహిళలపేర్లు పెట్టాడని పోలీసులు గర్తించారు. ఇలా ఐదుగురు కొరియన్ మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

డేటింగ్ వెబ్‌సైట్‌లో కలిసిన ఆరో యువతిపై ఆకృత్యానికి యత్నించాడు. బాధితురాలు తనపై దాడి చేస్తుండగా మేల్కొని, బాత్రూంలో దాక్కుని స్నేహితుడికి సందేశాలు పంపడంతో 2018 అక్టోబర్ 21న ధంఖర్‌ని అరెస్టు చేశారు. స్లీపింగ్ డ్రగ్ స్టిల్నాక్స్ లేదా అప్రసిద్ధ డేట్-రేప్ డ్రగ్ రోహైప్నాల్ టాబ్లెట్‌లతో ధన్‌ఖర్ వైన్, ఇతర పానీయాల గ్లాసులను యువతులకు ఇచ్చేవాడని ప్రాసిక్యూటర్లు వాదించారు.వివాహేతర సంబంధం తెగిపోవడంతో ఒంటరిగా ఉన్నందుకే మహిళలకు అబద్ధాలు చెప్పాడని ధంఖర్ న్యాయవాది వాదించారు. తన ఒంటరితనాన్ని భరించలేక ఇలా చేశాడని పేర్కొన్నాడు.

abuse

కేసులను విచారించిన కోర్టు అతడిని దోషిగా జ్యూరీ తేల్చింది. కొరియన్ అనువాదకుల కోసం ఫేక్ జాబ్ పోస్టింగ్‌తో మహిళలను వలలో వేసుకోవడానికి ధన్‌ఖర్‌కి 'చాలా నిర్దిష్టమైన కార్యనిర్వహణ' ఉందని జ్యూరీ పేర్కొంది. ఇక ఈ కేసులో చట్టపరమైన ఖర్చుల నిమిత్తం భలేశ్‌ కుటుంబ ఆస్తులన్నింటిని అమ్ముకున్నాడు. శిక్ష ఈ ఏడాది చివర్లో ఖరారు అయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+