చికాగోలో దీపావళి సంబరాలు

చికాగో: నవంబర్ 9, 2013న ఆస్వెగో ఈస్ట్ హైస్కూల్ ఆడిటోరియంలో జరిగిన దసరా-దీపావళి కార్యక్రమానికి 1000 కి ఫైగా ఆహుతులు విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేశారు. సాంస్క్రృతిక విభాగ అధిపతి శ్రీమతి మాలతి దామరాజు ఆహుతులకు ఆహ్వనం పలికి కార్యక్రమాన్ని ప్రారంబించారు. మొదటిగా టిఎజిసి కోశాధికారి శ్రీ జగన్ బుక్కరాజు, కార్యదర్శి శ్రీమతి సుజాత అప్పలనేని సంస్థ వార్షిక ఆదాయ వ్యయ వివరాలను నివేదించారు. అనంతర కార్యక్రమానికి శివ పసుమర్తి, శ్వేతా ర్యాలీ, మాలతి దామరాజు, సాయి రవి సురిభోట్ల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

చికాగో నగర ప్రాంతంలోని తెలుగు పెద్దల (సీనియర్ సిటిజెన్స్) కోసం అధ్యక్షులు శ్రీ రమేష్ గారపాటి టిఎజిసికి అనుబంధంగా చికాగో ఏరియా తెలుగు సీనియర్స్ (కాట్స్) అనే విభాగాన్నిప్రారంభించారు. ఈ విభాగం ఉద్దేశ్యం పెద్దల అవసరాలను గుర్తించి అందుకు అవసరమైన వనరులు సమకూర్చడం, వారి అనుభవాన్ని వినియోగించుకోవడం అని తెలిపారు. ఈ సందర్భంగా పెద్దలు శ్రీ అనంత్ ఊట్కూరు, శ్రీ యడవల్లి రమణమూర్తి, శ్రీ డా. సుసర్ల విశ్వనాథం, శ్రీ తాతా ప్రకాశం విచ్చేసి ఆశీర్వదించారు.

TAGC Celebrate Diwali in Chicago

అనంతరం అధ్యక్షులు శ్రీ రమేష్ గారపాటి 2013 సంవత్సరంలో టిఎజిసి నిర్వహించిన కార్యక్రమాల వివరాలను తెలిపారు. టిఎజిసి చరిత్రలో మొదటిసారిగా నిర్వహించిన మహిళా దినోత్సవం, సిఎస్ఎస్ సంస్థకు నిధుల సేకరణా ఉద్దేశ్యంతో నిర్వహించిన సంగీత విభావరి, ఏడాది పొడవునా నిర్వహించిన క్రీడాపోటీలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. తరువాత క్రీడాపోటీల విజేతలకు ఆటా వ్యవస్థాపకులు శ్రీ హనుమంతరెడ్డి గారు, టిఎజిసి వ్యవస్థాపక సభ్యులు శ్రీ యడవల్లి రమణమూర్తి జ్జ్ఞాపికలను అందించారు.

తరువాత టిఎజిసి సభ్యులు, బాలలు, యువతీయువకులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ, గాయకులు శ్రీ కృష్ణ చైతన్య తమ గానవిభావరితో సభికులను విశేషంగా ఆనందింపజేశారు. ధ్వన్యనుకరణ కళాకారుడు శ్రీ శివారెడ్డిగారి కార్యక్రమం అందరినీ కడుపుబ్బ నవ్వించగా, శ్రీ కృష్ణ చైతన్యతో కలిసి ఆయన చేసిన హాస్య నాటిక ఆ సాయంత్రానికి హైలైట్ గా నిలిచింది.

ఈ సంవత్సరం ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి తోడ్పడిన అమెరికా తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ కరుణాకర్ మాధవరంకు, కార్యనిర్వాహక సభ్యులు కళ్యాణ్ ఆనందుల, ప్రదీప్ కందిమళ్ళ, రవి ఉపాధ్యాయుల, రామ్ ఆడే, అంజిరెడ్డి కందిమళ్ళ, హరి రాయిని, భార్గవి నెట్టెం, నరేందర్ చేమర్ల, అమర్ నెట్టెం, శ్రీనివాస్ బొమ్మినేని, శ్రీనివాస్ పెదమల్లు, కిరణ్ మట్టే, మూర్తి పిసిపాటి, సుందర్ దిట్టకవి, జగన్ బుక్కరాజు, రాఘవ జట్ల, మాలతి దామరాజు, సుజాత అప్పలనేని, సత్య కొండపల్లి, స్వచ్ఛంద కార్యకర్తలు పద్మాకర్ దామరాజు, బిందు గొంగాటి, సాయిరెడ్డి గొంగాటి, సాహితి కొట్టా, పద్మ మాదిరెడ్డి, నందిని బుక్కరాజు, జ్యోతి చింతలపాని, సంధ్య అప్పలనేని, పద్మారావు అప్పలనేని, కిరణ్ నూతలపాటి గార్లకు అధ్యక్షులు శ్రీ రమేష్ గారపాటి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. జన గణ మన గీతాలాపనతో కార్యక్రమం సుసంపన్నం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+