టాంటెక్స్ 97వ ‘నెల నెలా తెలుగు వెన్నెల’(పిక్చర్స్)
టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు గత ఆదివారం(ఆగస్ట్16వ) దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ అధ్యక్షతన ఘనంగా జరిగింది.
ప్రవాసంలో నిరాటంకంగా 97 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డల్లాస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేశారు.
నేమాని పార్థసారధి శిష్య బృందం ఆలపించిన ‘గరుడ గణనాయక రారా' ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. జొన్నవిత్తుల రచించిన ‘బొంగరాల సుడిగల' అనే తెలుగు భాషా వైభవాన్ని చాటిచెప్పే గీతాన్ని చిన్నారులు నువ్వుల అభిరాం, బ్రహ్మదేవర ఫ్రణవ్, మర్నేని స్నేహ, మర్నేని స్నిగ్ధ, కోరాడ రిషిక, కోట ఆకాష్ ఎంతో మనోహరంగా ఆలపించారు.
దొడ్ల రమణ ఆధ్వర్యంలో పోతన భాగవతంలోని పద్యాలను చిన్నారులు పటించటమే కాకుండా, పద్యాల్లోని పదాలకు అర్థాన్ని కూడా విశదీకరిస్తూ తెలుగు భాషలోని మాధుర్యాన్ని రుచి చూపించారు. చిన్నారులు దొడ్ల నిర్జర, మాడ సంహిత, మాడ సమన్విత, కస్తూరి అమృత, మందిరం వర్షిణి, మందిరం హర్షిణి, నేమాని కార్తిక్‌లు తెలుగు భాషపై చూపుతున్న ఆసక్తి, ప్రావీణ్యం అందరిని ముగ్దులను చేసింది.
చేవూరి చంద్రశేఖర్ రెడ్డి స్వీయ రచన ఆకట్టుకుంది. కథలు, కవితలు, యాత్రా రచనలు, సాహిత్య వ్యాసాలు, రూపకాలు, రేడియో ప్రసంగాల ద్వారా సుపరిచితులయిన దాసరి అమరేంద్ర ‘సామాన్యుని సాహితీయానం'పై తమ స్వీయ అనుభవాలను ఆహూతులతో పంచుకున్నారు.

నెల నెలా తెలుగు వెన్నెల
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు గత ఆదివారం(ఆగస్ట్16వ) దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ అధ్యక్షతన ఘనంగా జరిగింది.

నెల నెలా తెలుగు వెన్నెల
ప్రవాసంలో నిరాటంకంగా 97 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం.

నెల నెలా తెలుగు వెన్నెల
డల్లాస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేశారు.

నెల నెలా తెలుగు వెన్నెల
నేమాని పార్థసారధి శిష్య బృందం ఆలపించిన ‘గరుడ గణనాయక రారా' ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది.

నెల నెలా తెలుగు వెన్నెల
జొన్నవిత్తుల రచించిన ‘బొంగరాల సుడిగల' అనే తెలుగు భాషా వైభవాన్ని చాటిచెప్పే గీతాన్ని చిన్నారులు నువ్వుల అభిరాం, బ్రహ్మదేవర ఫ్రణవ్, మర్నేని స్నేహ, మర్నేని స్నిగ్ధ, కోరాడ రిషిక, కోట ఆకాష్ ఎంతో మనోహరంగా ఆలపించారు.

నెల నెలా తెలుగు వెన్నెల
దొడ్ల రమణ ఆధ్వర్యంలో పోతన భాగవతంలోని పద్యాలను చిన్నారులు పటించటమే కాకుండా, పద్యాల్లోని పదాలకు అర్థాన్ని కూడా విశదీకరిస్తూ తెలుగు భాషలోని మాధుర్యాన్ని రుచి చూపించారు.

నెల నెలా తెలుగు వెన్నెల
చిన్నారులు దొడ్ల నిర్జర, మాడ సంహిత, మాడ సమన్విత, కస్తూరి అమృత, మందిరం వర్షిణి, మందిరం హర్షిణి, నేమాని కార్తిక్‌లు తెలుగు భాషపై చూపుతున్న ఆసక్తి, ప్రావీణ్యం అందరిని ముగ్దులను చేసింది.

నెల నెలా తెలుగు వెన్నెల
చేవూరి చంద్రశేఖర్ రెడ్డి స్వీయ రచన ఆకట్టుకుంది. కథలు, కవితలు, యాత్రా రచనలు, సాహిత్య వ్యాసాలు, రూపకాలు, రేడియో ప్రసంగాల ద్వారా సుపరిచితులయిన దాసరి అమరేంద్ర ‘సామాన్యుని సాహితీయానం'పై తమ స్వీయ అనుభవాలను ఆహూతులతో పంచుకున్నారు.
జీవితం-సాహిత్యం వేరు కావని, అవి పరస్పర ఆధారితాలు అనీ, పుస్తకాలు చదివితే వాటి యొక్క ప్రభావం మన నిత్య జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తాయో చాలా చక్కగా వివరించారు అమరేంద్ర. సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ ప్రశ్నావినోదం (క్విజ్) అందరిని ఆకట్టుకుంది.
ముఖ్య అతిధి ఆచార్య రవ్వ శ్రీహరి ‘అన్నమయ్య భాషా వైభవం' పై చేసిన ప్రసంగం అందరినీ తెలుగు భాష, భక్తి రసంలో ముంచెత్తింది. రచనా ప్రక్రియలో తెలుగు రచనలకు పెద్ద పీట వేసి, సుమారు 50గ్రంథాలను, 25 సంస్కృత గ్రంధాలను రచించి, పరిశోధన, సృజన, విమర్శ, అనువాదం, నిఘంటు నిర్మాణం వంటి రంగాలమీద తమదైన ముద్ర వేశారు.
శ్రీహరి ద్రావిడ విశ్వవిద్యాలయానికి మాజీ ఉపకులపతిగా, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దాదాపు పదిహేడు సంవత్సరాలు బోధన చేసి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్ గా పని చేసి తెలుగు భాషపై అనర్గళమైన పరిఙ్ఞానాన్ని ఆపాదించుకుని ధన్యులయ్యారు. వీరు సంస్కృత విశ్వవిద్యాలయంచే మహామహోపాధ్యాయ బిరుదు, సి.పి.బ్రౌన్ పురస్కారాలు అందుకున్న ఘనత వీరికే దక్కింది.
ఈనాడు మన తెలుగు భాష ప్రయోగంలో చాలా వరకు సంస్కృత పదాలను ఉపయోగించటం జరుగుతోందని, అన్నమయ్య మాండలిక భాషను ప్రయోగించిన తీరును తెలియజేస్తూ, మనకు తెలియని చాలా తెలుగు పదాలను తెలియజేశారు.
ఈ కార్యక్రమం దేశీ ప్లాజా టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కావడంతో అమెరికా నలుమూలల నుండి ఎంతో మంది వీక్షించారు. అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. టాంటెక్స్ ప్రత్యేక కార్యక్రయం ఈ టీవీ వారి "స్వరాభిషేకం" ఆగష్టు 29న ఆలెన్ ఈవెంట్ సెంటర్లో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయని, అందరు విచ్చేసి జయప్రదం చేయమని కోరారు.
నెల నెలా తెలుగు వెన్నెల వందవ మైలురాయి చేరుతున్న సందర్భంలో శత సదస్సు "100వ నెల నెలా తెలుగు వెన్నెల" నవంబర్ 14న ఘనంగా జరుపడానికి సన్నాహాలు మొదలుపెట్టారని, అధిక సంఖ్యలో పాల్గొని భాషాభిమానాన్ని చాటిచెప్పాలన్నారు.
టాంటెక్స్ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, పాలకమండలి ఉపాధిపతి చాగార్లమూడి సుగన్, ఉపాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కార్యదర్శి ఆదిభట్ల మహేష్ ఆదిత్య, సంయుక్త కార్యదర్శి వీర్నపు చిన సత్యం, కోశాధికారి శీలం కృష్ణవేణి, సంయుక్త కోశాధికారి పావులూరి వేణు, పాలకమండలి సభ్యులు బావిరెడ్డి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు పాలేటి లక్ష్మి, సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ, కలవగుంట సుధ ముఖ్య అతిథి ఆచార్య రవ్వ శ్రీహరిని శాలువ, జ్ఞాపికతో సత్కరించారు.
పోషకదాతలు జువ్వాడి రమణ, డా. పెనుకొండ ఇస్మాయిల్ జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. సమన్వయకర్తగా వ్యవహరించిన అట్లూరి స్వర్ణ మాట్లాడుతూ.. సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications