NRI News: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి మృతి..

అమెరికాలో వరుస రోడ్డు ప్రమాదాల్లో భారతీయులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా యూఎస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మరణించాడు. పై చదువుల కోసం ఏపీకి చెందిన ఆచంట రేవంత్ అమెరికా వెళ్లాడు. ఏపీలోని బాపట్ల జిల్లాలోని పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్‌ (22) గత సంవత్సరం డిసెంబర్ లో అమెరికా వెళ్లాడు. అక్కడి మాడిసన్ లోని డకోట స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నాడు.

రేవంత్ మంగళవారం తెల్లవారుజామున(భారత కాలమానం) ముగ్గురు స్నేహితులతో కలసి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు కారులో బయల్దేరారు. ఒక్కసారిగా పొగ మంచు కమ్ముకుని, కారు అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రేవంత్ అక్కడికక్కడే మరణించాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

Telugu student died in a road accident in America

అంతకు ముందు అమెరికాలోని పోర్టుల్యాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచి గ్రామానికి చెందిన కమతం నరేష్ ఆయన భార్య గీతాంజలి అమెరికాలో ఉంటున్నారు. వారికి ఆరు సంవత్సరాల కుమార్తె హానిక, మూడేళ్ల కుమారుడు బ్రమణ్‌ ఉన్నాడు. ఆదివారం గీతాంజలి పుట్టిన రోజు కావడంతో తెల్లవారుజామునే గుడికి వెళ్లారు.

తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వారి కారు ప్రమాదానికి గురైంది. ఘటన్ స్థలిలోనే హానిక మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గీతాంజలి మృత చెందింది. గీతాంజలి, ఆమె కూతురు హానిక మృతదేహాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ ప్రమాదంలో గీతాంజలి భర్త నరేష్, కుమారుడు బ్రమణ్‌ స్వల్పంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+