వరంగల్, ఖమ్మం ఎన్నికలకు యుకె ఎన్నారైల ప్రచారం

హైదరాబాద్: ఈ నెల 6వ తేదీన జరుగనున్న వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో NRI TRS - UK సభ్యులు ఒక బృందంగా వచ్చి ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు యుకె అధికార ప్రతినిధి శ్రీకాంత్ జెల్ల తెలిపారు. లండన్ ఇంచార్జ్ రత్నాకర్ కడుదుల అద్యక్షతన జరిగిన సమావేశంలో ప్రత్యేకించి ఓ కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ కమిటీలో వరంగల్, ఖమ్మంకు చెందిన సబ్యులు ఉంటారని , ఈ కమిటీకి ఇంచార్జిగా రత్నాకర్ కడుదుల వ్యవహరిస్తారని అతనే క్షేత్రస్తాయిలో పర్యటించి ప్రచార బాద్యతలు చూసుకుంటారని, కో ఆర్డినేటర్‌గా సృజన్ రెడ్డి చాడ ఉంటారని అద్యక్షులు అనిల్ కూర్మాచలం తెలిపారు.

ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ... వరంగల్, ఖమ్మం మరియు అచ్చంపెటలో గులాబీ జెండా ఎగరడం కాయమని కానీ బాధ్యత గల టీఆర్ఎస్ కార్యకర్తగా మా వంతు బాద్యత నిర్వహించడానికి బృందంగా వెళ్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చడం ఇప్పుడు చారిత్రాత్మక అవసరమని అన్నారు.

UK Team campaign for Warangal and Khammam municipal elections

ఎలాగైతే నాటి తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుండి నేటి బంగారు తెలంగాణా పునర్నిర్మాణం వరకు కేసీఆర్ వెంట ఉన్నామో, ఇక భవిష్యత్తులో కూడా సందర్భం ఏదైనా, ఆయన వెంట ఉండి టీఆర్ఎస్ ప్రచారాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ సెక్రటరీ నవీన్ రెడ్డి, సతీష్ రెడ్డి బండ సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తారు.

ఈ కమిటీలో సభ్యులుగా రత్నాకర్ కడుదుల(ఇంచార్జ్), సృజన్ రెడ్డి చాడ(కొ ఆర్డినేటర్ & సోషల్ మీడియా ఇంచార్జ్), రాజ్‌కుమార్ శాణబోయిన , సునీల్ రెడ్డి మందా, వినయ్ ఆకుల, శ్రీధర్ రావు తక్కలపల్లి, విక్రమ్ రెడ్డి రేకుల, మల్లేష్, ప్రవీణ్, సుభాష్ తదితరులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+