లండన్‌లో వరంగల్ ఉప ఎన్నిక విజయోత్సవం
లండన్: వరంగల్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పసునూరి దయాకర్ రికార్డ్ మెజార్టీతో గెలవడంపై క్షేత్ర స్థాయి నాయకులే కాకుండా ఖండంతరాల్లో నివసిస్తున్న ప్రవాస టిఆర్ఎస్ నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు.
ఎన్నారై టిఆర్ఎస్ సెల్ లండన్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సానుభూతిపరులు ఒక్క దగ్గర చేరి శుభాకాంక్షలు తెలుపుకొని సంబరాలు చేసుకున్నారు. కెసిఆర్ జిందాబాద్ అంటూ లండన్ వీధుల్లో నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ముందుగా వరంగల్ ప్రజలకు కృతజ్ఞాభివందనాలు తెలిపారు. ఈ విజయం వరంగల్ ప్రజలతోపాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, ఎంతో బాధ్యతగా కర్తవ్యం నిర్వహిస్తున్న మంత్రులు, నాయకులదని తెలిపారు.

నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణా బిడ్డలు, ముఖ్యంగా టిఆర్ఎస్ కార్యకర్తలు గర్వపడుతున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎప్పటిలాగే అన్ని సమయాల్లో పార్టీ వెంటే ఉండి, అది ఎన్నికల సమయమైన లేక పునర్నిర్మాణంలోనైనా మా బాధ్యతగా కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు వెళ్తామని చెప్పారు.
ఈ సంబరాల్లో ఎన్నారై టిఆర్ఎస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, కార్యదర్శి నవీన్ రెడ్డి, కార్యదర్శి దొంతుల వెంకట్ రెడ్డి , యూకే, యురోప్ ఇంఛార్జ్ విక్రమ్ రెడ్డి, లండన్ ఇంఛార్జ్ రత్నాకర్ కడుడుల, అధికార ప్రతినిధి శ్రీకాంత్ జెల్ల, వెల్‌ఫేర్ ఇంఛార్జ్ వినయ్ కుమార్, మెంబర్‌షిప్
ఇంఛార్జ్ సతీష్ రెడ్డి బండ, ముఖ్య నాయకులు సృజన్ రెడ్డి చాడా, సత్యం రెడ్డి కంది, సత్య హాజరయ్యారు.












Click it and Unblock the Notifications