ఏడేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారం

15-year-old boy allegedly rapes a minor in Andhra Pradesh
విశాఖపట్నం‌: విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నంలో గల ఎగువగట్టులో జరిగింది. బాలిక తల్లిదండ్రులు ఈ సంఘటనపై భీమునిపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన ప్రాంతానికే చెందిన బాలికను బాలుడు బుజ్జగించి దుశ్చర్యకు పాల్పడ్డాడు. బాలుడిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. బాలికును వైద్యపరీక్షలు, చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ అస్పత్రికి తరలించారు.

సరుకులు కొనడానికి బాలిక సమీపంలోని దుకాణానికి వెళ్లిందని, తన కుటుంబ సభ్యులు లేకపోవడాన్ని ఆసరా తీసుకుని బాలుడు ఆ బాలికను తన ఇంటికి తీసుకుని వెళ్లాడని, బాలికను కొట్టి వశపరుచుకున్నాడని భీమునిపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్ లక్ష్మణ మూర్తి చెప్పారు.

బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. బాలిక జరిగిన సంఘటన గురించి తల్లికి చెప్పింది. నిందితుడిని పట్టుకోవడానికి బాలిక తండ్రులు వెళ్లారు. అయితే, అప్పటికే అతను పారిపోయాడు. గ్రామ పెద్దలు సమావేశం ఏర్పాటు చేసి సంధి కుదర్చడానికి ప్రయత్నించారు. అయితే, బాలిక తల్లిదండ్రులు వినకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions