కోరిక తీర్చాలని వెంటపడిన వ్యక్తి, మహిళ ఆత్మహత్య

రాయవరం పోలీస్ స్టేషన్ సమీపంలో నివాసముంటున్న ఓ మహిళలపై గత కొంతకాలంగా లక్కోజు రాజేష్ అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. రాజేష్‌ను తన ప్రవర్తన మార్చుకోవాలని ఆ మహిళ పలుమార్లు హెచ్చరించింది. అయినా రాజేష్ తన వేధింపులను అలాగే కొనసాగించాడు.
మహిళకు తన కోరిక తీర్చమని ఫోన్ చేసి మరీ బెదిరింపులకు పాల్పడటంతో ఎక్కడ పరువు పోతుందోనని తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. రాజేష్ వేధింపుల విషయంపై బాధితురాలి బంధువులు పోలీసులను ఆశ్రయించినా వారు పట్టించుకోలేనదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో మృతురాలి బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. నిందితున్ని వెంటనే అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications