ఏసీలను 24 డిగ్రీల్లో పెట్టాలని కేంద్ర విద్యుత్ శాఖ రిక్వస్ట్.. !
వేసవిలో భానుడి భగభగల నుంచి సేదతీరడానికి చేసే పనుల్లో ఒకటి ఏసీ ఆన్ చేయడం. ఎయిర్ కండిషనర్లకు బాగా అలవాటు పడిన వారు.. బయట ఎక్కువ సేపు ఉండలేరు. అయితే ఇప్పుడు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియెన్సీ బ్యూరో (BEE) ఏసీ వినియోగిస్తున్న ప్రజలకు, వ్యాపార సంస్థలకు ఓ కీలక విజ్ఞప్తి చేసింది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు హైదరాబాదుతో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లోని ఏసీలను 24 డిగ్రీల సెల్సియస్ డీఫాల్ట్ సెట్టింగ్‌లో ఉంచాలని కోరుతుంది.
ఎయిర్ కండిషనర్లను డీఫాల్ట్ గా 24 డిగ్రీల సెల్సియస్‌కు పెంచితే, సంవత్సరానికి సుమారు రూ.4,000 వరకు విద్యుత్ బిల్లులో పొదుపు చేయవచ్చని స్పష్టం చేస్తోంది. అదే ఉష్ణోగ్రతను 27 డిగ్రీల వరకు పెంచితే ఏడాది విద్యుత్ బిల్లు రూ.6,500 వరకూ తగ్గించుకోవచ్చని అంటున్నారు. దీనివల్ల విద్యుత్ వినియోగం కూడా తక్కువ అవుతుందని వెల్లడిస్తుంది.

90 లక్షలకు పైగా జనాభా ఉన్న హైదరాబాదును, పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తగిన విద్యుత్-సదుపాయాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, తక్కువ ఖర్చుతో AC వాడకాన్ని ప్రోత్సహించే ప్రధాన నగరంగా BEE గుర్తించింది. అందులో భాగంగా BEE కార్యదర్శి మిలింద్ దేవొరే మాట్లాడుతూ.. TSREDCO, SDA హైదరాబాదులోని ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, హోటల్లు, ప్రభుత్వ భవనాలలో ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. రోజుకి 8-10 గంటలు పనిచేసే ఒక్క AC యూనిట్ దాదాపు 10 కిలోల CO₂ వాయువు ఉద్గరిస్తుందని పేర్కొన్నారు.
ఎందుకు 24 డిగ్రీలు?
ఎనర్జీ ఎఫిషియెన్సీ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా ఉపయోగించే 18-21 డిగ్రీల ఉష్ణోగ్రతల్ని 24 డిగ్రీలకు పెంచితే సుమారు 24 శాతం వరకు విద్యుత్ పొదుపు సాధ్యమవుతుంది. జపాన్, అమెరికా వంటి దేశాల్లో ఇదివరకే ACల వినియోగంపై నియంత్రణలు అమలులో ఉన్నాయి. జపాన్‌లో ఎయిర్ కండిషనర్లకు 28 డిగ్రీల డీఫాల్ట్ సెట్టింగ్‌ను అమలు చేశారు. అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో 26 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతను అనుమతించడంలేదు. ఈ విధంగా తీసుకునే చర్యల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్ (రూ.10,000 కోట్ల విలువైన) పొదుపు చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇది సంవత్సరానికి సుమారు 8.2 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపుకు సమానం అని చెబుతున్నారు.
సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 36-37 డిగ్రీల మధ్య ఉంటుంది. అందువల్ల 24 డిగ్రీలు ఆరోగ్యపరంగా కూడా మానవ శరీరానికి అనుకూలంగా ఉంటుంది. మన దేశం లాంటి ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది సౌకర్యాన్ని కలిగించే ఉష్ణోగ్రతగా పరిగణించబడుతుందని వివరిస్తున్నారు. ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో భారీ విద్యుత్ పొదుపు సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఇంటర్నెట్ లేకుండానే "ఇన్స్టాగ్రామ్" రీల్స్ చూడడం ఎలాగంటే..? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications