E20 పెట్రోల్‌పై భయాందోళనలు: సర్వేలో వెల్లడైన నిజాలు
ప్రస్తుతం భారత ఇంధన రంగంలో E20 పెట్రోల్ ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇది 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్‌తో కూడిన ఒక మిశ్రమ ఇంధనం. దేశంలో ఇంధన భద్రతను పెంచడానికి దిగుమతులను తగ్గించడానికి, పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే వాహన యజమానుల్లో ఈ కొత్త ఇంధనం వల్ల తమ వాహనాలకు ఎలాంటి సమస్యలు వస్తాయోనన్న ఆందోళన పెరుగుతోంది. ప్రభుత్వం ఈ ఇంధనం సురక్షితమని భరోసా ఇస్తున్నప్పటికీ.. 'లోకల్ సర్కిల్స్' అనే సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు ప్రభుత్వ వాదనలకు భిన్నంగా ఉన్నాయి.
సర్వే ఫలితాలు ఇలా..
లోకల్ సర్కిల్స్ సర్వేలో దేశవ్యాప్తంగా 331 జిల్లాలకు చెందిన 37 వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్య విషయాలు ఆశ్చర్యపరిచేవిగా ఉన్నాయి.
పాత వాహనాలకు సమస్యలు: సర్వేలో పాల్గొన్న 2022కి ముందు తయారైన పెట్రోల్ కార్ల యజమానుల్లో 28 శాతం మంది E20 పెట్రోల్ వాడటం మొదలుపెట్టిన తర్వాత తమ వాహనాలకు ఎక్కువగా మరమ్మతులు అవసరమయ్యాయని తెలిపారు. ఈ సమస్యలు ముఖ్యంగా ఇంజిన్, ఫ్యూయల్ లైన్, ఫ్యూయల్ ట్యాంక్, కార్బ్యురేటర్ వంటి ముఖ్య భాగాలలో కనిపించాయి.

మైలేజ్ తగ్గుదల: ఈ సర్వేలో పాల్గొన్న వాహనాదారుల్లో రెండు వంతుల మంది E20 పెట్రోల్‌కు మారిన తర్వాత తమ వాహనాల మైలేజ్ గణనీయంగా తగ్గిందని తెలిపారు. దీని వల్ల ఇంధనంపై, వాహన నిర్వహణపై ఖర్చు పెరిగింది.
వినియోగదారుల డిమాండ్, ప్రభుత్వ వైఖరి
ఈ సర్వే ప్రకారం 52 శాతం మంది ప్రజలు E20 పెట్రోల్ ధరను కనీసం 20 శాతం తగ్గిస్తేనే దాన్ని ఆమోదిస్తామని, అలాగే E10 లేదా సాధారణ పెట్రోల్ వంటి ఇతర ఇంధనాలను ఎంచుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం భారతదేశంలోని చాలా పెట్రోల్ పంపుల్లో E20 పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే దీనిపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ మాట్లాడుతూ.. పంపుల్లో కేవలం E20 ఇంధనం మాత్రమే లభిస్తుందని, ప్రస్తుతం వేరే మిశ్రమ ఇంధనాలు అమ్మే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇది ప్రజల స్వేచ్ఛను పరిమితం చేస్తోందని సర్వే సూచిస్తోంది.
E20 పెట్రోల్‌పై వివాదం ఎందుకు?
E20 పెట్రోల్‌పై వివాదం ప్రధానంగా ఇంధనంలో ఉండే ఇథనాల్ వల్ల వస్తోంది. ఇథనాల్, పెట్రోల్ కంటే వేగంగా కాలుతుంది. ఇది ఇంజిన్ భాగాలపై తుప్పు పట్టడానికి కారణం కావచ్చు. ఇథనాల్ ఇంజిన్ సిలిండర్‌లలో తుప్పు పట్టేలా చేయగలదు. ఇథనాల్ ఇంజిన్ సిలిండర్‌లలో తుప్పు పట్టేలా చేయగలదు. ముఖ్యంగా తరచుగా వాడని వాహనాల్లో ఈ సమస్య ఎక్కువ. E20 పెట్రోల్‌కు అనుకూలంగా ఉండే కొత్త ఇంజిన్‌లలో ఈ సమస్యను నివారించడానికి ప్రత్యేక పూత ఉంటుంది. అయితే, పాత కార్లలో అలాంటి పూత ఉండదు. పాత వాహనాల ఇంజిన్‌లను E20కి అనుకూలంగా మార్చడం సులభం కాదు, దీనికి ఫ్యూయల్ ట్యాంక్, ఫ్యూయల్ లైన్, ఇంజిన్ వంటి అనేక భాగాలను మార్చాల్సి ఉంటుంది. ఈ కారణాల వల్ల పాత వాహనాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ప్రజల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని పాత వాహనాల యజమానులకు ఏమైనా ప్రత్యామ్నాయాలు అందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
-
ఏప్రిల్ 1: కొత్త శకం ప్రారంభం, లాభనష్టాలు ఇవే! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications