జియోతో అంబానీ మరో సంచలనం.. నేటి నుంచే రూ.35,100 విలువైన ప్లాన్ ఫ్రీ !!
భారతీయ టెలికాం రంగంలో మరోసారి సంచలనం సృష్టిస్తూ.. రిలయన్స్ జియో తమ 5జీ వినియోగదారులకు భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికే అనౌన్స్ చేసిన విధంగా గూగుల్ అత్యాధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ 'జెమినీ ప్రో' ప్లాన్‌ను.. నేటి ( నవంబర్ 19, 2025 ) నుంచి పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జియో సంస్థ అధికారికంగా వెల్లడించింది. రూ.35,100 విలువైన ఈ ప్లాన్‌ను జియో 5జీ వినియోగదారులు 18 నెలల పాటు ఏ రూపాయి ఖర్చు లేకుండా వినియోగించుకోవచ్చు.
ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
కాగా ఈ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఈ విధంగా స్టెప్స్ ఫాలో అవ్వాలి. ముందుగా మై జియో యాప్‌లో "Claim Now" బ్యానర్‌పై క్లిక్ చేస్తే వెంటనే ఈ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఆఫర్‌ను ప్రధానంగా రెండు గ్రూపులు పొందగలవు. వీటిలో ఒకటి.. అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ ఉన్న జియో యూజర్లు. కనీసం రూ.349 విలువైన 5జీ అన్‌లిమిటెడ్ ప్లాన్ యాక్టివ్‌గా ఉండాలి. రెండోదిగా.. 18-25 ఏళ్ల మధ్య వయస్సున్న యూత్ (ఇప్పటి వరకూ ఈ గ్రూప్‌కే ప్రత్యేక ఆఫర్ ఉండేది). ఇప్పుడు ఈ ఆఫర్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అర్హత కలిగిన జియో 5జీ యూజర్లకు విస్తరించారు.

ప్లాన్ లో ఏమేమి లభిస్తాయి?
ఈ జెమినీ ప్రో ప్లాన్‌లో భాగంగా జియో వినియోగదారులకు లభించే సేవలు:
- Gemini 2.5 Pro / Gemini 3 Pro మోడల్‌లకు యాక్సెస్
- 2TB వరకు క్లౌడ్ స్టోరేజ్
- Veo 3.1 వీడియో జనరేటర్ - హై క్వాలిటీ వీడియో క్రియేషన్స్
- Nano Banana - ఫాస్ట్ AI ఇమేజ్ & మీడియా జనరేషన్
- Gmail, Google Docsల్లో AI అసిస్టెన్స్
- NotebookLM యాక్సెస్ - రీసెర్చ్, స్టడీస్ కోసం అద్భుతమైన టూల్
- ఫొటోలు, వీడియోలు, ప్రెజెంటేషన్లు, వెబ్‌సైట్లు తయారు చేసే AI టూల్స్
ఇవి అన్నీ సాధారణంగా రూ.35,100 విలువైన ప్లాన్‌లో వచ్చే సేవలు. ఇప్పుడు 18 నెలల పాటు జియో 5జీ యూజర్లకు ఫ్రీ గా పొందవచ్చు.
గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఈ భాగస్వామ్యంపై మాట్లాడుతూ.. భారత్‌లో AI వినియోగం వేగంగా పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ టెక్నాలజీని ప్రతి భారతీయుడి వరకు చేరవేయడం లక్ష్యమని.. అందుకు జియో విస్తృత నెట్‌వర్క్ తోడ్పాటునిస్తుందని పేర్కొన్నారు. ఈ Gemini 3 Pro.. GPT-5.1, Claude 4.5 కంటే మెరుగైన ఫలితాలు ఇస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు AI రంగంలో తమ అవకాశాలను విస్తరించేందుకు రిలయన్స్ ఇంటెలిజెన్స్ - మెటా కలిసి "Reliance Enterprise Intelligence Limited - REIL" పేరిట ఒక సంయుక్త సంస్థను స్థాపించాయి. అందులో రిలయన్స్ 70% వాటా, మెటా 30% వాటా పెట్టాయి. ప్రారంభ పెట్టుబడిగా 855 కోట్లు ఉంచారు. దీంతో ఎంటర్‌ప్రైజ్ AI సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసి, భారతీయ పరిశ్రమల్లో విస్తృతంగా అందించడానికి ఈ సంస్థ పని చేస్తుంది. జెమినీ ప్రో ప్లాన్‌ను జియో ద్వారా ఉచితంగా అందించడం కూడా ఈ పెద్ద విజన్‌లో భాగమే.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications