ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే.. అదిరిపోయే డీల్!
యాపిల్ ఐఫోన్ లకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో వీటికి సపరేట్ బ్రాండ్ ఉంది, అయితే ఐఫోన్ 16 128GB మోడల్ రూ.79,990, 256GB వెర్షన్ రూ.89,990.. 512GB వేరియంట్ రూ.1,09,990గా ఉన్నాయి. అయితే ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో 128GB బ్లాక్ ఎడిషన్ ఐఫోన్ 16 పై భారీ డిస్కౌంట్ తీసుకొచ్చింది.
భారీ తగ్గింపు..
ఎక్స్ఛేంజ్ ద్వారా ఐఫోన్ 16ని రూ.34,000 లోపు పొందే అవకాశం కల్పిస్తుంది. ఐఫోన్ 16 (128 GB, బ్లాక్) ప్రస్తుతం రూ. 72,400 తగ్గింపు ధరతో లభిస్తుంది. ఇది అసలు ధరపై 9% డిస్కౌంట్‌ను సూచిస్తుంది. మంచి స్థితిలో ఉన్న ఐఫోన్ 15ని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా కస్టమర్లు రూ. 35,000 వరకు పొందవచ్చు. దాంతో ఫోన్ ధర రూ.37,400కు తగ్గుతుంది. అంతే కాకుండా SBI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే వారికి రూ.4,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్‌లన్నీ కలిపి ఐఫోన్ 16 ని కేవలం రూ.33,400 కే పొందవచ్చని తెలుస్తోంది.

ఫోన్ ముఖ్య ఫీచర్లు:
-
6.1 అంగుళాల Super Retina XDR OLED డిస్‌ప్లే – 2556x1179 పిక్సెల్స్ రెసల్యూషన్, 460ppi డెన్సిటీ
-
IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ – నీటి చిందులు, ధూళి నుండి రక్షణ
-
48MP ఫ్యూజన్ కెమెరా (2x టెలిఫోటో లెన్స్‌తో)
-
12MP అల్ట్రావైడ్ కెమెరా
-
12MP TrueDepth ఫ్రంట్ కెమెరా (ƒ/1.9)
-
స్పేషియల్ ఫోటో & వీడియో సపోర్ట్ – 3D అనుభూతి కలిగించే మల్టీ-డైమెన్షనల్ మీడియా
కెమెరా కంట్రోల్ ఫీచర్:
ఈ కొత్త ఫీచర్ వలన కెమెరా యాక్సెస్ చాలా వేగంగా ఉంటుంది. ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం మరియు విజువల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తువులను గుర్తించడం మరింత సులభం అవుతుంది. రాబోయే iOS అప్‌డేట్స్‌లో ఇది మరింత అభివృద్ధి చెందనుంది.
ఆడియో ఫీచర్లు – స్టూడియో లెవెల్ సౌండ్:
-
ఆడియో మిక్స్, వాయిస్ ఆప్టిమైజేషన్ టూల్స్
-
గాలి శబ్దం తగ్గింపు (Machine Learning ఆధారంగా)
-
స్టూడియో నాణ్యతలో వాయిస్ ట్రాక్, బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని మిక్స్ చేయడం
అధునాతన ప్రాసెసింగ్ పవర్ – A18 బయోనిక్ చిప్:
-
3nm టెక్నాలజీతో నిర్మితమైన రెండవ తరం A18 చిప్
-
16-కోర్ న్యూరల్ ఇంజిన్ – లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) ను కూడా సపోర్ట్ చేస్తుంది
-
6-కోర్ CPU – గత మోడల్ A16 కంటే 30% వేగవంతమైన పనితీరు
యాపిల్ ఇంటెలిజెన్స్, iOS 18
-
రైటింగ్ టూల్స్ – మెయిల్, నోట్స్, పేజెస్, మెసేజ్ లలో AI ఆధారిత టెక్స్ట్ రివైటింగ్, ప్రూఫ్ రీడింగ్
-
నోట్స్ మరియు కాల్ రికార్డింగ్ – ట్రాన్స్‌క్రిప్ట్, సంభాషణ సారాంశం, రిమైండర్స్
-
వ్యక్తిగతీకరణ – Siri మరింత ఇన్‌టెలిజెంట్ గా మారడం, కంటెంట్ పర్సనలైజేషన్
-
ప్రారంభ విడుదల US Englishతో ప్రారంభమవుతుండగా, ఇతర భాషలలో 2024 చివరి నాటికి వస్తుంది
ఈ డీల్ ద్వారా మీరు కొత్తగా విడుదలైన ఐఫోన్ 16ను, దాని అసలైన ధర కంటే సుమారు రూ.46,000 తక్కువ ధరకు పొందవచ్చు. ఇది ఒకసారి మాత్రమే వచ్చే అవకాశంగా చెప్పొచ్చు.
-
-
-












Click it and Unblock the Notifications