IPhone 18 Pro: క్రేజీ ఫీచర్లు, ఇక పండగే!
ఆపిల్ కంపెనీ అంటేనే కొత్తదనానికి మారుపేరు. ఇంకా ఐఫోన్ 17 సిరీసే మార్కెట్లోకి రాలేదు, అప్పుడే 'ఐఫోన్ 18 ప్రో' (iPhone 18 Pro) గురించి ఇంటర్నెట్‌లో చర్చ జోరందుకుంది. 2026 సెప్టెంబర్‌లో గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న ఈ ఫోన్‌లో.. మనం ఊహించని ఎన్నో అదిరిపోయే మార్పులు ఉండబోతున్నాయి. అవేంటో ఒకసారి లుక్కేద్దాం!
ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో కొత్త 'LTPO Plus AMOLED' డిస్‌ప్లేను వాడుతున్నారట. దీని స్పెషాలిటీ ఏంటంటే.. మనం ఏదైనా చదువుతున్నప్పుడు లేదా ఫోన్ వాడనప్పుడు ఇది రిఫ్రెష్ రేట్‌ను కేవలం 1Hz కు తగ్గించేస్తుంది. దీనివల్ల బ్యాటరీ చార్జింగ్ చాలా తక్కువ ఖర్చవుతుంది. అంటే, స్క్రీన్ క్వాలిటీ అద్భుతంగా ఉండటమే కాదు, ఫోన్ చార్జింగ్ కూడా ఎక్కువ సేపు వస్తుంది. దీని ద్వారా యాపిల్ ఫోన్స్ కు లో బ్యాటరీ తిప్పలు తప్పుతాయి

డిజైన్‌లో పెద్ద మార్పు.. ఐఫోన్ 18 ప్రో క్లీన్ లుక్!
చాలా కాలంగా మనం చూస్తున్న డిజైన్‌కు ఆపిల్ స్వస్తి చెప్పబోతోంది. ముఖ్యంగా Face ID సెన్సార్లను డిస్‌ప్లే కిందకు పంపే అవకాశం ఉంది. దీనివల్ల ఫోన్ ముందు భాగం చాలా క్లీన్‌గా, అతుకులు లేని గ్లాస్‌లా కనిపిస్తుంది. పైన ఉండే డైనమిక్ ఐలాండ్ సైజు కూడా మరింత తగ్గుతుందట.
కొత్త రంగుల్లో మెరిసిపోతుంది!
ప్రతి ఏటా కొత్త రంగులను పరిచయం చేసే ఆపిల్.. ఈసారి 'ప్రో' మోడల్స్ కోసం పర్పుల్ (Purple), బర్గుండి (Burgundy) కలర్స్‌ని పరీక్షిస్తోందట. ఐఫోన్ 17 లో వచ్చిన 'కాస్మిక్ ఆరెంజ్' లాగే, ఇవి కూడా యూత్ కి బాగా నచ్చుతాయని భావిస్తున్నారు.
పవర్‌ఫుల్ చిప్‌సెట్.. రాకెట్ స్పీడ్!
ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో A20 Pro చిప్‌సెట్‌ను వాడబోతున్నారు. ఇది 2nm (నానోమీటర్) టెక్నాలజీతో తయారవుతోంది. అంటే ఫోన్ పెర్ఫార్మెన్స్ రాకెట్ లాగా ఉంటుంది కానీ, ఫోన్ మాత్రం అస్సలు వేడెక్కదు (Thermal Management). గేమింగ్ ప్రియులకు ఇది ఒక మంచి వార్త!
కెమెరాలో సరికొత్త మ్యాజిక్!
ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడేవారికి ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఒక స్పెషల్ గిఫ్ట్ కాబోతోంది. కొత్త సెన్సార్లతో పాటు, ఆప్టికల్ జూమ్ సామర్థ్యం పెరగనుంది. ముఖ్యంగా చీకట్లో (Low light) కూడా పగలు తీసినంత క్లారిటీతో ఫోటోలు వచ్చేలా కెమెరా సెట్టింగ్స్ ఉండబోతున్నాయట.
ఫోల్డబుల్ ఐఫోన్‌తో కలిసి ఎంట్రీ?
అన్నిటికంటే పెద్ద వార్త ఏంటంటే.. ఈ ఐఫోన్ 18 ప్రో మోడల్స్‌తో పాటే, ఆపిల్ తన మొదటి 'ఐఫోన్ ఫోల్డ్' (iPhone Fold) ని కూడా మార్కెట్లోకి తెచ్చే ఛాన్స్ ఉంది. అయితే బేసిక్ మోడల్ (iPhone 18) మాత్రం 2027 ప్రారంభంలో రావచ్చని సమాచారం.
మొత్తానికి, ఐఫోన్ 18 ప్రో సిరీస్.. ఫ్యూచరిస్టిక్ డిజైన్ మరియు అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ లోకాన్ని షేక్ చేయబోతోంది. ఆపిల్ లవర్స్ అందరూ 2026 సెప్టెంబర్ కోసం ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ మొదలుపెట్టేయవచ్చు!












Click it and Unblock the Notifications