ఐ ఫోన్ డిజైన్‌తో లావా న్యూ మొబైల్.. కేవలం రూ. 6,999 !
భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లతో ఫోన్‌లను లాంఛ్ చేస్తున్న లావా.. ఈసారి మాత్రం ఐ ఫోన్ ని టార్గెట్ చేసింది. ఐఫోన్ 16 ప్రో డిజైన్‌తో తక్కువ ధరకే 4g మొబైల్ ని తీసుకొచ్చింది. ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ లను 'షార్క్' సిరీస్ పేరిట రిలీజ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ ఫోనుకి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా...
షార్క్ పేరుతో కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్ లను ప్రవేశపెడుతున్న లావా.. రూ.9 వేల లోపు ఫోన్ లను ఈ సిరీస్ లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. తొలిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారిని దృష్టిలో ఉంచుకొని ఈ మొబైల్ లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇక ఈ మొబైల్ యాపిల్ ఐఫోన్ 16 ప్రో డిజైన్ తోనే వస్తుండడంతో భారీగా డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది.

లావా 'షార్క్' మొబైల్ ఫీచర్స్..
స్టోరేజ్..
4జీబీ ర్యామ్‌తోపాటు 4 జీబీ వర్చువల్ ర్యామ్‌తో, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తోంది. 256జీబీ వరకు పెంచుకోవచ్చు.
కెమెరా..
వెనకవైపు 50 ఎంపీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఏఐ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, ప్రో మోడ్, హెచ్‌డీఆర్ ఎన్‌హ్యాన్స్ ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
డిస్‌ప్లే..
ఇందులో 6.67 అంగుళాల హెచ్‌డీ+ పంచ్ హోల్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేటుకు సపోర్ట్ చేస్తుంది.
ఛార్జింగ్..
ఈ మొబైల్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బాక్సుతో పాటు ఛార్జర్‌ను ఇస్తున్నారు.
లాక్ సిస్టమ్..
ఫేస్ అన్‌లాక్‌తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది.
కలర్స్..
టైటానియం గోల్డ్, స్టెల్త్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
ప్రాసెసర్..
ఆండ్రాయిడ్ 14తో ఈ ఫోన్ పనిచేస్తుంది. యూనిసోక్ టీ606 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు.
ఇక అంతే కాకుండా లావా రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ లభిస్తుందని.. త్వరలో మరిన్ని ఫోన్లు ఈ సిరీస్‌లో తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇంటివద్దే సర్వీస్ చేసి ఇస్తామని కూడా ఆఫర్ చేస్తున్నారు.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications