Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ.11000 లోపు "శాంసంగ్" నుంచి టాప్ 3 బెస్ట్ మొబైల్స్ ఇవే..?

మార్కెట్లో రోజూ ఒక కొత్త ఫోన్ లాంఛ్ అవుతూనే ఉంటుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే 5జీ ఫోన్ లను లాంఛ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే స్మార్ట్ ఫోన్ లలో టాప్ బ్రాండ్స్ అంటే సామ్‌సంగ్ ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇప్పుడు తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నవారికి Samsung ప్రస్తుతం ఆకర్షణీయమైన ఎంపికలను అందిస్తోంది. ముఖ్యంగా గెలాక్సీ F, M సిరీస్‌లలో వచ్చే ఫోన్లు మంచి బ్యాటరీ లైఫ్, నమ్మదగిన పనితీరు, సరైన కెమెరా క్వాలిటీతో బడ్జెట్ వినియోగదారులకు బాగా సరిపోతున్నాయి. రూ.11,000 లోపు ధరలో అందుబాటులో ఉన్నాయి.

ఈ మూడు ఫోన్లు తమ తమ ధరలకు అద్భుతమైన విలువను అందిస్తున్నాయి. తక్కువ ధరలో ఫోన్ కావాలంటే Galaxy F07.. బ్యాలెన్స్ పనితీరు కావాలంటే Galaxy M07.. 5Gతో పాటు మెరుగైన పనితీరు కావాలంటే Galaxy M06 5G కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ పరిమితిలో మంచి కెమెరా, బ్యాటరీ, పనితీరు కోరుకునే వారికి ఈ ఫోన్లు సరైన ఎంపికలు. మీ అవసరాలకు తగ్గట్టు వీటిలో ఏదైనా ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ మూడు బెస్ట్ మోడల్స్‌ ఫీచర్స్, ధర మీకోసం ప్రత్యేకంగా..

three-best-budget-samsung-mobiles-under-11000-and-complete-details-about-specifications-also-price

Samsung Galaxy M07..

గెలాక్సీ M07 ఒక సమతుల్యమైన స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుంది. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ.8,399కి అందుబాటులో ఉంటుంది.

  • 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్
  • MediaTek Helio G99 ప్రాసెసర్ - డైలీ యూజ్, లైట్ గేమింగ్‌కు సరిపోతుంది
  • 50MP ప్రైమరీ కెమెరా + 2MP డెప్త్
  • 8MP ఫ్రంట్ కెమెరా
  • 5000mAh బ్యాటరీ + 25W ఫాస్ట్ ఛార్జింగ్

సోషల్ మీడియా, వీడియోలు, సాధారణ గేమింగ్ కోసం మంచి ఆల్‌రౌండ్ ఫోన్.

Samsung Galaxy F07..

samsung గెలాక్సీ F07 సుమారు రూ.7,799కి లభిస్తుంది.

  • 6.7-అంగుళాల PLS LCD HD+ డిస్‌ప్లే
  • 90Hz రిఫ్రెష్ రేట్
  • MediaTek Helio G99 ప్రాసెసర్
  • 4GB RAM + 64GB స్టోరేజ్
  • 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా
  • 8MP సెల్ఫీ కెమెరా
  • Android 15 ఆధారిత One UI 7
  • 5000mAh బ్యాటరీ

తక్కువ ధరలో బ్రాండ్ ఫోన్ కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్.

Samsung Galaxy M06 5G..

5G కనెక్టివిటీ కావాలనుకునే వారికి గెలాక్సీ M06 5G మంచి ఎంపిక. ధర సుమారు రూ.10,999.

  • 6.7-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
  • MediaTek Dimensity 6300 ప్రాసెసర్
  • 6GB RAM + 128GB స్టోరేజ్ వరకు
  • 50MP + 2MP డ్యూయల్ కెమెరా
  • 8MP ఫ్రంట్ కెమెరా
  • 5000mAh బ్యాటరీ + 25W ఛార్జింగ్

ఇతర ముఖ్యాంశాలు..

One UI అనుభవం: Samsung UI సింపుల్‌గా ఉండి, కొత్త యూజర్లకు సులభంగా ఉపయోగించుకోవచ్చు

సాఫ్ట్‌వేర్ అప్డేట్స్: ఈ బడ్జెట్ ఫోన్లకు కూడా కనీసం 2 సంవత్సరాల అప్డేట్స్ లభించే అవకాశం ఉంది

బిల్డ్ క్వాలిటీ: ప్లాస్టిక్ బాడీ అయినప్పటికీ మంచి ఫినిష్, గ్రిప్ ఉంటుంది

సెక్యూరిటీ ఫీచర్లు: సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి

స్టోరేజ్ ఎక్స్‌పాన్షన్: మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకునే అవకాశం

డ్యూయల్ SIM సపోర్ట్: రెండు SIM కార్డులు ఉపయోగించవచ్చు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+