You Tube: క్రియేటర్లకు ఆదాయం పెంచడానికి కొత్త ప్రొగ్రామ్ తీసుకొచ్చిన యూట్యూబ్..

కంటెంట్ క్రియేటర్ల ఆదాయం పెంచడానికి ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా షాపింగ్ ప్రొగ్రామ్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు ప్రొడక్టులను ట్యాగ్ చేసి ఆదాయం పొందవచ్చు. ఇందుకోసం యూట్యూబ్ ఫ్లిప్‌కార్ట్, మైంట్రాతో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రొగ్రామ్ లో భాగంగా.. YouTube సృష్టికర్తలు తమ వీడియోలలో ఉత్పత్తులను ట్యాగ్ చేయాలి. వీక్షకులు రిటైలర్‌ల సైట్‌లో వాటిని కొనుగోలు చేసినప్పుడు క్రియేటర్లకు కమీషన్ డబ్బులు వస్తాయి.

క్రియేటర్ ఈ ఫీచర్ ను వాడాలనుకుంటే.. యూట్యూబ్ షాపింగ్ సైన్ అప్ చేయాలి. సైన్ అప్ చేయాలంటే 10,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉండాలి. అయితే ఇది యూట్యూబ్ కిడ్స్ ప్రొగ్రామ్ చేసేవారికి, అలాగే మ్యూజిక్ ఛానల్ నడుతున్నవారు ఈ ఫీచర్ ను వాడుకోలేరని యూట్యూబ్ తెలిపింది. యూట్యూబ్ షాపింగ్ ప్రొగ్రామ్ ఇప్పటికే అమెరికా, దక్షణ కొరియాలో అందుబాటులో ఉంది. తాజాగా ఇండియాలో కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

YouTube has introduced a shopping program to increase revenue for creators

ప్రోగ్రామ్‌లో భాగమైన సృష్టికర్తలు తమ వీడియోలలో భాగంగా ఉత్పత్తులను ప్రదర్శించవచ్చు. క్రియేటర్ల ట్యాగ్ చేసిన ఉత్పత్తి క్లిక్ చేస్తే అక్కడే ప్రొడక్ట్ సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు. యూజర్లకు ఆ ఉత్పత్తులు నచ్చితే పక్కనే ఉన్న షాపింగ్‌ సింబల్‌పై క్లిక్‌ ఆ ప్రొడక్ట్‌ వివరాలు కనిపిస్తాయని కంపెనీ పేర్కొంది.
ఉత్పత్తికి సంబంధించిన కొన్ని వివరాలను చూసేందుకు వీలుగా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, వెబ్‌లోని ఇంటర్‌ఫేస్ కోసం యాప్‌లను యూట్యూబ్ అప్‌డేట్ చేస్తోంది.

క్రియేటర్లు ట్యాగ్ చేసిన వస్తువును కొనుగోలుని కొనసాగించాలని నిర్ణయించుకుంటే, వారు భాగస్వామి షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌కి వెళ్తారు. ఎంచుకున్న ఉత్పత్తి ఫ్లిప్ కార్ట్ ప్రొడక్ట్ అయితే ఫ్లిప్ కార్ట్ వెళ్తారు. లేకుంటే మైంత్రాకు వెబ్ సైట్ వెళ్తారు. ప్రేక్షలు ఉత్పత్తులు కొనుగోలు చేస్తే కమీషన్ వస్తుంది. "మేము దేశంలోకి వచ్చినప్పుడు సృష్టికర్త పర్యావరణ వ్యవస్థ ఉనికిలో లేదు. సృష్టికర్తలు మాతో వారి భాగస్వామ్యాన్ని ఉపయోగించుకుని అపారమైన ఆవిష్కరణలను తీసుకువచ్చాము. మేము మార్కెట్‌కు తీసుకువచ్చిన ప్రత్యేకమైన ఆదాయ భాగస్వామ్య నమూనా దీనికి కారణమైంది" అని యూట్యూబ్ APAC రీజినల్ డైరెక్టర్ అజయ్ విద్యాసాగర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+