ఐపీఎల్ 2025 ఛాంపియన్ ఎవరో వెల్లడించిన మాజీ లెజెండర్
IPL 2025 Qualifier 2: ఐపీఎల్ 2025.. క్వాలిఫయర్ 2 ఉత్కంఠభరితంగా మారింది. టైటిల్ హాట్ ఫేవరెట్ గా ఉంటూ వచ్చిన గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ దశలోనే తిరుగుముఖం పట్టడంతో సమీకరణాలు, అంచాలన్నీ తారుమారు అయ్యాయి. ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్ 2 అడుగుపెట్టడం.. ఈ సిరీస్ ను మరింత రసవత్తరంగా మార్చింది.
ఈ ఆదివారం క్వాలిఫయర్ 2 గేమ్ జరుగనుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ బిగ్ గేమ్ కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఢీ కొట్టబోతోంది ముంబై ఇండియన్స్. ఇందులో గెలిచిన జట్టు మంగళవారం జరిగే ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది.

ముల్లాన్ పూర్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయాన్ని సాధించింది. 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. దీన్ని కొట్టలేకపోయింది గుజరాత్. ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులే చేయగలిగింది.
ముంబై ఇన్నింగ్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ హైలైట్. 50 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 81 పరుగులు చేశాడీ ఓపెనర్. జానీ బెయిర్ స్టో సుడిగాలి ఇన్నింగ్ దీనికి తోడైంది. 22 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 47 పరుగులు బాదాడు బెయిర్ స్టో. సూర్యకుమార్ యాదవ్- 33, తిలక్ వర్మ- 25, హార్దిక్ పాండ్యా- 22, నమన్ ధీర్- 9 చేశారు.
గుజరాత్ ఇన్నింగ్ లో సాయి సుదర్శన్ ఎప్పట్లాగే టాప్ స్కోరర్ గా నిలిచాడు. 49 బంతుల్లో ఒక సిక్స్, 10 ఫోర్లతో 80 పరుగులు చేశాడు. కీలకమైన ఈ మ్యాచ్ లో కేప్టెన్ శుభ్ మన్ గిల్ విఫలం అయ్యాడు. ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. ధాటిగా ఆడిన కుశాల్ మెండిస్ హిట్ వికెట్ గా వెనుదిరిగాడు.
151 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ వికెట్ అవుట్ కావడం.. గుజరాత్ ఇన్నింగ్ ఓటమికి పునాది వేసింది. ఆ వెంటనే సాయి సుదర్శన్ పెవిలియర్ దారి పట్టడంతో ఓటమి ఖరారైంది. షెర్ఫానె రూథర్ ఫర్డ్- 24, రాహుల్ తెవాతియా- 16 (నాటౌట్), ఎం షారుఖ్ ఖాన్- 13, రషీద్ ఖాన్ - 0 (నాటౌట్) చేయగలిగారంతే.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లల్లో ఏ జట్టు ఫైనల్స్ కు చేరుతుంది?, ఛాంపియన్ గా ఏ టీమ్ ఆవిర్భవిస్తుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మాజీ క్రికెటర్లు, లెజెండరీలు తమ అంచనాలను వెలిబుచ్చతున్నారు.
తాజాగా దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ స్టార్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్.. ఈ విషయంపై మాట్లాడారు. రాయల్ ఛాలెంజర్స్ ఈ సీజన్ ఛాంపియన్ గా నిలుస్తుందని పేర్కొన్నాడు. విజేతగా ఆవిర్భవించడానికి ఆ జట్టుకు అన్ని అర్హతలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. ఫైనల్స్ లో ఎవరు తలపడ్డా.. ఆర్సీబీకే విజయం దక్కుతుందని అన్నాడు.
ఆర్సీబీ ఫైనల్స్ చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు ఏబీడీ. ఎలిమినేటర్ లో ముంబై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని కితాబిచ్చాడు. బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించిందని పేర్కొన్నాడు. పంజాబ్ తో ఫైనల్స్ హోరాహోరీగా ఉంటుందని అభిప్రాయపడుతున్నట్లు చెప్పాడు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications