ఏంటి..! మెస్సీ బాడీగార్డ్ జీతం రూ.27కోట్ల..!
లియోనెల్ మెస్సీ... ఈ పేరు వింటే గూస్ బంప్స్ పక్కా. అర్జెంటీనాకు చెందిన ఈ సాకర్ ప్లేయర్ అంటే ఇటు చిన్న పిల్లల నుంచి అటు పండు ముదసలి వరకు యమ క్రేజ్ ఉంది. ఫుట్‌బాల్ మైదానంలోకి దిగాడంటే ప్రత్యర్థి జట్టుకు మెస్సీని కట్టడి చేయడం కష్టమే. బంతిపై తనకున్న నియంత్రణ, చూడచక్కటి కిక్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉన్న టాప్ టెన్ సెలబ్రిటీల్లో మెస్సీ కచ్చితంగా ఉంటాడు.
ఎందుకంటే మెస్సీ ఫాలోయింగ్ ఆ రేంజ్‌లో ఉంటుంది. మరి అలాంటి స్టార్ ఆటగాడు సామాన్యుల మధ్య తిరగాల్సి వస్తే ఆయన భద్రత ఏంటనే ప్రశ్న వస్తుంది. మెస్సీకి కూడా ఒక పర్సనల్ బాడీ గార్డ్ ఉన్నాడు. నిత్యం మెస్సీతోనే ఉంటూ అతని సేఫ్టీ చూస్తుంటాడు. ఇంతకీ ఆ బార్డీగార్డ్ ఎవరు.. అతనికి మెస్సీ ఇస్తున్న జీతం ఎంత ఈ స్టోరీలో చూద్దాం.

యాసిన్ చుయెకో-మెస్సీ బాడీగార్డ్
లియోనెల్ మెస్సీ బాడీగార్డ్ యాసిన్ చుయెకో- మాజీ US నేవీ సీల్, MMA ఫైటర్. మెస్సీ మైదానంలో ఉన్న ప్రతిసారీ టచ్‌లైన్ పక్కనే ఉండి, ప్రేక్షకులపై నిశితంగా నిఘా పెట్టి, ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉంటాడు.చుయెకో సాధారణ అభిమాని కాదు పిచ్‌లోకి దూసుకొస్తున్నవారు, అతిగా ఉత్సాహపడే అభిమానులు నుండి ప్రపంచకప్ విజేతను రక్షించడం ఆయన బాధ్యత. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లలో పోరాట అనుభవం కలిగిన మాజీ నేవీ సీల్‌గా, చుయెకో మైదానంలోనూ బయటా మెస్సీ వెంట ఉండి, ఆయన పూర్తిగా భద్రంగా ఉండేలా చూసుకుంటారు.
యాసిన్ కు సోషల్ మీడియాలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనను 9 లక్షలకు పైగా మంది ఫాలో చేస్తున్నారు. ఆయన చేసిన ట్రైనింగ్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. మెస్సీ వెంట పరిగెత్తడం, పిచ్‌పైకి దూసుకొచ్చిన ఒక యువకుడిని క్షణాల్లో అదుపులోకి తీసుకోవడం వంటి సంఘటనలు ఆయనకు మరింత పేరును తీసుకొచ్చాయి.
Messi's bodyguard pic.twitter.com/2fL5mwibIV
— Crazy Moments (@Crazymoments01) October 1, 2025
యాసిన్ జీతం మైండ్ బ్లోయింగ్
ఇంటర్ మయామి మ్యాచ్‌ల సమయంలోనూ, బయట బహిరంగ ప్రదేశాల్లోనూ మెస్సీని రక్షించడం, ఏ ముప్పునైనా ముందుగానే గుర్తించి అడ్డుకోవడం చుయెకో ప్రధాన బాధ్యత. ఈ కీలక బాధ్యతకు తగినట్లుగానే ఆయనకి భారీ పారితోషికం లభిస్తుంది. నివేదికల ప్రకారం, చుయెకో నెలకు సుమారు 2.5 లక్షల డాలర్లు సంపాదిస్తున్నట్లు చెబుతారు.ఇది సంవత్సరానికి 3 మిలియన్ డాలర్లతో సమానం(ఇండియన్ కరెన్సీ ప్రకారం 27కోట్లు ).
👮♂️🇦🇷 During Inter Miami matches, Leo Messi is followed by an ex-US Navy Seal for maximum security.
— EuroFoot (@eurofootcom) August 24, 2023
The bodyguard is a martial arts, boxer and taekwondo expert. He can be seen even following him during matches. pic.twitter.com/Gl8n1UzHXV
మెస్సీ, ఆయన కుటుంబ భద్రత కోసం పనిచేసే 50 మంది సభ్యులతో కూడిన బృందానికి చుయెకో నాయకత్వం వహిస్తున్నారు. ఎంత ఫెమ్ వచ్చిన, ఆయన దృష్టి మాత్రం ఒకటే - మెస్సీ భద్రత. టాప్ సాకర్ ఆటగాళ్లకు సరిపడే స్థాయి పారితోషికం లభించడంతో, ఈ కీలక బాధ్యతను ఆయన అత్యంత సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఇక మెస్సీ డిసెంబర్ 13వ తేదీన హైదరాబాద్‌కు రానున్నాడు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఒక ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నాడు. మెస్సీ సెక్యూరిటీలో భాగంగా యాసిన్ కూడా వస్తున్నాడు. మరి మీరు ఉప్పల్ స్టేడియంకు వెళుతున్నట్లయితే అక్కడ ఈ చిరుతపులి యాసిన్‌ని చూసే అవకాశం ఉంటుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications