IPL 2026 ఛాంపియన్ ఆ జట్టే, తేల్చేసిన అక్షర్ పటేల్..!!

IPL 2026 ప్లే ఆఫ్స్ దశకు చేరింది. నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ లో ఆడి ఫైనల్స్ లో అడుగు పెట్టేలా కసరత్తు చేస్తున్నాయి. అయితే..ప్లే ఆఫ్స్ వేళ ఏ జట్టు ఈ సారి ఛాంపియన్ అవుతుందో అంచనా లు పెరిగిపోతున్నాయి. గత ఏడాది ఆర్సీబీ విజేతగా నిలవటంతో.. ఈ సారి ఆర్సీబీతో పాటుగా మరో రెండు టీంల వైపు ప్రముఖ క్రికెటర్లు మొగ్గు చూపుతున్నారు. ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ సారి ఛాంపియన్ ఎవరో తేల్చి చెప్పారు. ఇప్పుడు అక్షర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఐపీఎల్ 2026 విజేత ఎవరు అవుతారనే అంశం పైన అక్షర్ పటేల్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఈ సారి కప్‌ ఏ జట్టు సొంతం చేసుకుంటుందో ముందే చెప్పేశాడు. డీసీ, కేకేఆర్‌ మ్యాచ్‌ పూర్తయి న తరువాత అక్షర్‌ స్పందించారు. ప్లేఆఫ్ అర్హత సాధించిన జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత బలమైన జట్టు అని, ఈ సారి కప్‌ సన్‌రైజర్స్‌ సొంతం చేసుకుంటుందని అక్షర్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్‌హెచ్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఈ క్రమంలో అక్షర్ పటేల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ టెన్‌లో ఎస్ఆర్‌హెచ్‌కు చెందిన ముగ్గురు బ్యాటర్లు ఉన్నారు. హెన్రిచ్ క్లాసెన్ 14 మ్యాచ్‌లలో 50.50 సగటు, 159.47 స్ట్రైక్ రేట్‌తో 606 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నాడని అక్షర్‌ గుర్తు చేశారు.

 దక్షిణ మధ్య రైల్వే కుదింపు - ఈ స్టేషన్లు, ప్రధాన రైళ్లు ఇక నుంచి..!!
దక్షిణ మధ్య రైల్వే కుదింపు - ఈ స్టేషన్లు, ప్రధాన రైళ్లు ఇక నుంచి..!!
axar-patel-believes-sunrisers-hyderabad-are-the-strongest-side-heading-into-the-ipl-2026-playoffs

హోరా హోరీగా మారుతున్న పోరు

ఇషాన్ కిషన్ 14 మ్యాచ్‌లలో 40.64 సగటు, 178.36 స్ట్రైక్ రేట్‌తో 569 పరుగులు చేసి ఆరో స్థానంలో ఉన్నాడు. మరోవైపు, ఓపెనర్ అభిషేక్ శర్మ 14 మ్యాచ్‌లలో 43.31 సగటు, 206.22 స్ట్రైక్ రేట్‌తో 563 పరుగులు చేసి ఏడో స్థానంలో ఉన్నాడు.వీరు చెలరేగితే ఆపడం ఎవరి తరం కాదన్నారు. ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలిచింది. వారి దూకుడైన బ్యాటింగ్ విధానం ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తుందని పేర్కొన్నాడు. అలాగే ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు కూడా బాగా రాణిస్తున్నారు. వారి టాప్ ఆర్డర్ ట్రావిస్ హెడ్, అభిషేక్, ఇషాన్‌ కిషన్, జట్టుకు మెరుపు ఆరంభాలను అందించి, మిడిల్ ఆర్డర్‌కు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దూకుడైన వారి బ్యాటింగ్‌ను అడ్డుకోవడం ఏ జట్టుకైనా అంత సలువు కాదన్నారు. అందుకే తాను ఎస్‌ఆర్‌హెచ్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. బుధవారం జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్, ఆర్‌ఆర్‌తో తలపడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+