IND Vs AUS: కేఎల్ రాహులే ఓపెనర్.. తేల్చి చెప్పిన రోహిత్ శర్మ..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగబోయే పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్ట్ భారత్ సిద్ధమైంది. అయితే రెండో టెస్ట్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ అందుబాటులోకి వచ్చారు. దీంతో ఓపెనర్లు ఎవరు వస్తారు అనేది సందేహంగా మారింది. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. రెండో టెస్టులో రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడని రోహిత్ ప్రకటించాడు. తాను మిడిల్ ఆర్డర్ లో ఏదో ఒక స్థానంలో వస్తానని చెప్పాడు. "కేఎల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. నేను మధ్యలో ఎక్కడో ఆడతాను " అని రోహిత్ పేర్కొన్నాడు.
పెర్త్ లో జైశ్వాల్ జోడీ ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం గొప్ప విషయమని అన్నాడు. పెర్త్‌లో విజయంపై రోహిత్ ఆనందం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అడిలైడ్ ఓవల్‌లో లైట్ల కింద పింక్ బాల్‌తో ఆడటం కష్టమని అంగీకరించాడు. 2020లో ఆస్ట్రేలియా భారత్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకు ఆలౌట్ చేసింది. వారు ఇదే వేదికపై తమ ఏడు డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లలో విజయం సాధించారని గుర్తు చేశాడు. తాము గత మూడు రోజులుగా ఇక్కడ శిక్షణ పొందుతున్నట్లు వివరించాడు.

గిల్ మూడో స్థానంలో వస్తే.. విరాట్ కోహ్లీ నాల్గో పోజిషన్ లో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు రోహిత 5 లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ కు రావాల్సి ఉంటుంది. 5 మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ మొదటి టెస్ట్ విజయం సాధించింది. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో పెర్త్‌లో 295 పరుగుల భారీ విజయంచో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్ లో జైస్వాల్, విరాట్ కోహ్లీలు సెంచరీ సాధించారు. కాగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్ట్ జరగనుంది. ఇది డే అండ్ నైట్ టెస్ట్. పింప్ బాల్ తో ఆడతారు.
ఇండియా ప్లేయింగ్ 11 లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (సి), రిషబ్ పంత్ (వికెట్), ఆర్ అశ్విన్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్/హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications