ఐపీఎల్‌కు ఎదురు కట్నం చదివించుకుంటున్నావేంట్రా?
Digvesh Rathi: ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండో విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో రెండింట్లో గెలిచింది. మొత్తం నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. 8వ తేదీన నెక్స్ట్ మ్యాచ్ ఆడబోతోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఢీ కొట్టనుంది.
ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడింది లక్నో సూపర్ జెయింట్స్. రెండో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. ఆ తరువాత పంజాబ్ కింగ్స్ చేతిలో చతికిలపడింది. ఇప్పుడు తన సొంత గడ్డపై ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన లోకల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్ మిఛెల్ మార్ష్ టాప్ స్కోరర్. 60 పరుగులతో అదరగొట్టాడు. మరో ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్- 53, మిడిలార్డర్‌లో ఆయుష్ బదోనీ- 30, డేవిడ్ మిల్లర్ 27 పరుగులు చేయడంతో స్కోర్ 200 దాటింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఈ స్కోర్‌ను అందుకోలేకపోయింది. అయిదు వికెట్ల నష్టానికి 191 పరుగులే చేయగలిగింది. రోహిత్ శర్మ గైర్హాజర్ అయిన గేమ్ ఇది. ఓపెనర్లు విల్ జాక్స్, రియాన్ రికెల్టన్ విఫలం అయ్యారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు నమన్ ధీర్- 46, సూర్యకుమార్ యాదవ్- 67 మాత్రమే దుమ్ము దులిపారు.
డెత్ ఓవర్లల్లో హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడినా అప్పటికే మ్యాచ్ చేజారింది. 16 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక భారీ సిక్స్‌తో 28 పరుగులు చేశాడు హార్దిక్ పాండ్యా. నాటౌట్‌గా నిలిచాడు. అతని మెరుపు ఇన్నింగ్.. ఓటమి అంతర్యాన్ని తగ్గించగలిగిందే గానీ.. ఓటమి నుంచి జట్టును కాపాడలేకపోయింది.
కాగా- ఈ మ్యాచ్‌లో నమన్ ధీర్ వికెట్‌ను తీసిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేష్ రాఠీ మరోసారి వార్తల్లోకెక్కాడు. అతనిపై భారీ జరిమానా పడంది. వికెట్ తీసిన తరువాత అతన్ని కించపరిచేలా ప్రవర్తించాడు. వికెట్ పడ్డ అనంతరం రైటింగ్ ఇన్ మై నోట్ బుక్ సంకేతాలు ఇచ్చాడు. ఇది అతనిపై జరిమానా పడటానికి కారణమైంది.
అతనికి చెల్లించాల్సిన మ్యాచ్ ఫీజులో మొత్తం 25 శాతం మేర కోత పెట్టింది బీసీసీఐ. అంతకుముందు మ్యాచ్‌లో కూడా ఇలాగే వ్యవహరించిన విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యా అవుట్ అయిన తరువాత ఇలాగే- చేత్తో ఏదో రాస్తున్నట్లు ఫోజు ఇచ్చాడు.
నిజానికి- ఐపీఎల్ 2025 మెగా వేలం పాటలో 30 లక్షల రూపాయల బేస్ ప్రైజ్ కింద అతన్ని జట్టులోకి తీసుకుంది లక్నో సూపర్ జెయింట్స్. ఇప్పుడు వరుసగా రెండు మ్యాచ్‌లల్లో 25 శాతం చొప్పున అంటే 50 శాతం జరిమానా పడటం వల్ల అతని చేతికి వచ్చేదేమీ ఉండకపోవచ్చు. పైగా ఎదురు కట్నం చెల్లించుకోవాల్సి రావొచ్చు. ఇదే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కేప్టెన్ రిషభ్ పంత్‌పైనా ఫైన్ పడింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications