India vs Australia: టీమిండియాకు షాక్.. ఆసీస్ టూర్‌కు ఆ ఫాస్ట్ బౌలర్ దూరం..?

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించింది. ఇక రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ప్రైమ్‌మినిస్టర్స్ XIతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. రెండో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. అంతకుముందు షెడ్యూల్ ప్రకారం టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహ్మద్ షమీ జట్టులో చేరుతారనే వార్తలు వచ్చాయి.ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యేలా కనిపించడం లేదు. మొహ్మద్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం లేదని సమాచారం.

వాస్తవానికి మొహ్మద్ షమీ చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. బంతితో బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు.ఇక వరల్డ్ కప్ ముగిశాక షమీ మరే అంతర్జాతీయ మ్యాచ్‌లో కనిపించలేదు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో బ్రిస్బేన్‌లో జరగనున్న మూడవ టెస్టుకల్లా షమీ జట్టులో చేరి అందుబాటులో ఉంటారనే వార్తలు వచ్చాయి.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మొహ్మద్ షమీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. పెర్త్‌లో టీమిండియా బౌలర్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని జట్టు విజయంలో కీలక బౌలర్లు బుమ్రా, సిరాజ్, హర్షిత్ రానాల పెర్ఫార్మెన్స్ బాగుందని టీమిండియా పేర్కొంది.

India vs Australia Reports say Team India fast bowler Mohammed Shami to skip Aussies tour

ఇదిలా ఉంటే కాలు గాయంగ కారణంగా దాదాపుగా ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు మొహ్మద్ షమీ. ఇక ఏడాది తర్వాత మధ్యప్రదేశ్ బెంగాల్ మధ్య జరిగిన రంజీ ట్రోఫీతో తిరిగి బరిలో అడుగుపెట్టాడు. బెంగాల్ తరపున షమీ రంజీలో ఆడాడు.మధ్యప్రదేశ్‌ కీలక బ్యాట్స్‌మెన్లను నలుగురిని ఔట్ చేసి ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. ప్రస్తుతం ముష్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో భాగంగా బెంగాల్‌ తరపున షమీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే మూడు కీలక వికెట్లను పడగొట్టాడు.

India vs Australia Reports say Team India fast bowler Mohammed Shami to skip Aussies tour

ఇక షమీ అద్భుతమైన ఫామ్ కనబరుస్తుండటంతో కొద్ది రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్‌ సందర్భంగా ఆయన్ను సన్‌రైజర్స్ హైదరాబాదు జట్టు కొనుగోలు చేసింది.షమీ కోసం కావ్యా మారన్ రూ.10 కోట్లు వెచ్చించింది. గతేడాది షమీ గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు. ఇక మెగా ఆక్షన్ సందర్భంగా షమీనీ గుజరాత్ టైటాన్స్ రిటెయిన్ చేసుకోలేదు. మార్కీ ప్లేయర్ల రెండో జాబితాలో ఉన్న మొహ్మద్ షమీ బేస్ ధర రూ.2 కోట్లుకాగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ ఫాస్ట్ బౌలర్‌ను దక్కించుకునేందుకు పోటీ పడింది. రూ.9.75 కోట్లకు షమీని దక్కించుకునే ప్రయత్నం చేయగా... చివరి నిమిషంలో రంగంలోకి దిగిన కావ్యా మారన్ రూ.10 కోట్లకు బిడ్ వేసింది. ఇక కోల్‌కతా రేసునుంచి తప్పుకోగా... రైట్‌ టూ మ్యాచ్ కార్డు వాడుకునేందుకు గుజరాత్ టైటాన్స్‌కు అవకాశం దక్కినప్పటికీ వారు చేతులెత్తేయడంతో షమీ హైదరాబాద్ సొంతం అయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+