IPL 2024: గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం: మళ్లీ సొంత గూటికి
కోల్‌కత: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ఇంకో మూడు నాలుగు నెలలు ఉండగానే.. ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 10 జట్లు ఈ మెగా ఈవెంట్‌లో పోరాడనున్నాయి.
రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీనికోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. కొన్ని ఫ్రాంఛైజీల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. ఇదివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో హెడ్ కోచ్‌కు స్థానచలనం కలిగింది.

జింబాబ్వేకు చెందిన లెజెండరీ బ్యాటర్ ఆండీ ఫ్లవర్‌ను కొత్త హెడ్ కోచ్‌గా ప్రకటించింది. హెడ్ కోచ్ సంజయ్ బంగర్ స్థానంలో అతన్ని అపాయింట్ చేసుకుంది ఆర్సీబీ. ఫ్రాంఛైజీ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్, సంజయ్ బంగర్ కాంట్రాక్టులను పునరుద్ధరించలేదు ఆర్సీబీ ఫ్రాంఛైజీ. వారిద్దరి స్థానంలో ఆండీ ఫ్లవర్‌ను తీసుకుంది.
ఆ తరువాత రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీల్లో చోటు చేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్ లెజెండరీ బౌలర్ షేన్ బాండ్ అపాయింట్ అయ్యాడు. షేన్ బాండ్ స్థానంలో లసిత్ మలింగ.. ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు.
తాజాగా అలాంటి మార్పు ఇప్పుడు కోల్‌కత నైట్ రైడర్స్‌లో సంభవించింది. గతంలో ఈ జట్టు కేప్టెన్‌గా వ్యవహరించిన టీమిండిమా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తన సొంతగూటికి చేరుకున్నాడు. కోల్‌కత నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మెంటార్‌గా అపాయింట్ అయ్యాడు.
Welcome home, mentor @GautamGambhir! 🤗
— KolkataKnightRiders (@KKRiders) November 22, 2023
Full story: https://t.co/K9wduztfHg#AmiKKR pic.twitter.com/inOX9HFtTT
ఇదివరకు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)లో పని చేశాడు గంభీర్. ఇప్పుడు ఆ జట్టుకు గుడ్ బై చెప్పాడు. దీనికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటనను కొద్దిసేపటి కిందటే విడుదల చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు వీడ్కోలు పలికిన వెంటనే- తాను కేకేఆర్ మెంటార్ వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ నిర్ధారించారు.












Click it and Unblock the Notifications