IPL 2024 కొత్త కొత్తగా: కొద్ది గంటల్లో మెగా క్రికెట్ సంరంభం, చెన్నై వర్సెస్ బెంగళూరు తొలిపోరు
చెన్నై: మనదేశంతపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది క్రీడా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా క్రికెట్ సంరంభం ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. శుక్రవారం (మార్చి 22)న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ తొలి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ ఫేవరేట్ జట్లైన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్ కావడంతో ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్వీడన్ కు చెందిన ప్రముఖ డీజే, రికార్డ్ ప్రొడ్యూసర్, రీమిక్స్ స్పెషలిస్ట్ ఆక్స్ వెల్ తన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఇక, మ్యాచ్ కు ముందు ఓపెనింగ్ సెర్మనీలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, ఏఆర్ రెహమాన్, సోను నిగమ్ ఆడిపాడనున్నారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఐపీఎల్ ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ఈ ఐపీఎల్ సీజన్లో పలు మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఐపీఎల్ రూల్స్‌లో మార్పులు జరిగాయి. మరోవైపు, పలు ఐపీఎల్ జట్ల సారథులు కూడా మారారు.
ఈ జట్లకు కొత్త సారథులు
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాను యాజమాన్యం నియమించింది. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథ్య బాధ్యతలను యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు 2023లో డేవిడ్ వార్నర్ సారథిగా వ్యవహించగా.. ఈసారి రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ అప్పగించారు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సారథ్య బాధ్యతలను శ్రేయాస్ అయ్యర్‌కు కట్టబెట్టారు.
హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు ఈ సీజన్లో భారీ ధర పలికిన ప్యాట్ కమిన్స్ సారథిగా వ్యవహరించనున్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఓపెనర్ శుభమన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. గత సీజన్లో ఈ జట్టుకు హార్థిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్వవహరించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు
ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్ టీంతో తలపడే మ్యాచ్ మార్చి 27న జరగనుంది. హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఏప్రిల్ 5న రెండో మ్యాచ్ ఉంటుంది. ఈ రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి.
రెండో దశ దేశం వెలుపలే..?
సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపిఎల్ రెండవ దశను భారతదేశం నుంచి తరలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో భాగంగా పలు ప్రాంచైజీలు తమ ఆటగాళ్ల పాస్‌పోర్ట్‌లను సేకరించాయి. అయితే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) వర్గాలు మాత్రం లీగ్ భారత్‌లో మాత్రమే జరుగుతుందని పేర్కొంది. లీగ్‌లో మొత్తం 10 జట్లు ఆడనున్నాయి.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications