ఐపీఎల్ 2025 వేలం రూల్స్ భారీగా మార్పు: కళ్లు చెదిరేలా బిడ్ అమౌంట్ పెంపు
IPL 2025 Retention: వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే సీజన్ మొత్తం కొత్త కొత్తగా కనిపించబోతోంది. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దిగాయి.
ఈ దఫా జరిగే మెగా వేలం పాట సందర్భంగా దాదాపుగా కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని మార్పులు సైతం చోటు చేసుకున్నాయి. కోల్‌కత నైట్ రైడర్స్ కూడా కొత్త మెంటార్ వచ్చాడు. ఈ టీమ్ మెంటార్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్.. జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా అపాయింట్ కావడం వల్ల ఈ స్థానం ఖాళీ అయింది. ఆయన స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బౌలర్, వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో అపాయింట్ అయ్యాడు.

గుజరాత్ టైటాన్స్‌లోనూ ఇదే తరహా మార్పులు జరగొచ్చంటూ వార్తలొచ్చినప్పటికీ- అది వాస్తవ రూపం దాల్చలేదు. హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రాకు ఉద్వాసన పలకాలని గుజరాత్ టైటాన్స్ మొదట్లో నిర్ణయించుకున్నప్పటికీ తరువాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఆశీష్ నెహ్రాను కొనసాగించబోతోంది.
లక్నో సూపర్ జెయింట్స్ కేప్టెన్ కేఎల్ రాహుల్.. తన సొంత రాష్ట్రానికి వస్తాడనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరొచ్చనీ అంటున్నారు. ఇలాంటి అనేక మార్పులు- నెక్స్ట్ సీజన్ కోసం నిర్వహించే వేలంపాటలో చూడొచ్చు.
ఈ మెగా ఆక్షన్‌లో భారత జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు భారీ డిమాండ్ ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడీ రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. అతని కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్.. వాషింగ్టన్ సుందర్‌ను తమ జట్టులో తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తోన్నాయి.
ఈ పరిస్థితుల మధ్య భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ శుభవార్తను వినిపించింది. వేలంలో పాల్గొనే అన్ క్యాప్డ్ ప్లేయర్ల బేస్ ప్రైస్, కనీస బిడ్ అమౌంట్‌ను భారీగా పెంచింది. 30 లక్షల రూపాయలుగా నిర్ధారించింది. అంటే ఒక అన్ క్యాప్డ్ ప్లేయర్ కోసం ఆరంభం అయ్యే వేలం పాట 30 లక్షల రూపాయల నుంచి ఆరంభమౌతుంది. గతంలో ఈ మొత్తం 20 లక్షల రూపాయలుగా ఉండేది.
అలాగే- మ్యాచ్ ఆడే ప్రతి ప్లేయర్ కూడా ఒక్కో మ్యాచ్‌కు 7.5 లక్షల రూపాయల చొప్పున మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా చెల్లిస్తుంది బీసీసీఐ. లీగ్స్ దశలో ఒక ఆటగాడు 14 మ్యాచ్‌లను ఆడితే అతనికి అందే మొత్తం 1.05 కోట్ల రూపాయలు. ఇది అతని వేలం బిడ్ అమౌంట్‌కు అదనంగా లభిస్తుంది.












Click it and Unblock the Notifications