సలుపుతున్న పాత గాయానికి మందు దొరికింది
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 255/5 భారీ స్కోరు సాధించింది. అనంతరం న్యూజిలాండ్ జట్టు భారత బౌలింగ్ ధాటికి తట్టుకోలేకపోయింది. కివీస్ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఈ కీలక మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన జస్ ప్రీత్ బుమ్రా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు. నాలుగు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. భారత విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్‌తో అతను 40 వికెట్లతో టీ20 ప్రపంచ కప్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడాడు. సొంతగడ్డపై ఈ విజయం సాధించడం తనకు చాలా ప్రత్యేక క్షణమని వ్యాఖ్యానించాడు. ఈ విజయం చాలా ప్రత్యేకమైనదని అభివర్ణించాడు. ఇంతకు ముందు కూడా ఈ గ్రౌండ్ లో ఒక ఫైనల్ ఆడానని, అప్పుడు గెలవలేకపోయానని గుర్తు చేసుకున్నాడు. ఆ లోటు ఇప్పుడు తీరిపోయిందని పేర్కొన్నాడు. ఆ గాయం మానిపోయినట్టనిపిస్తోందని చెప్పాడు.
ఫైనల్ మ్యాచ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని బుమ్రా వివరించాడు. ఈ పిచ్ పై తనకు సంపూర్ణ అవగాహన, అనుభవం ఉందని, బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటం వల్ల తన సర్వ శక్తులనూ ధారపోయాల్సి వచ్చిందని, అన్ని అస్త్రశస్త్రాలను కూడా ఉపయోగించాల్సి వచ్చిందని బుమ్రా చెప్పాడు. ఈ వికెట్ ఫ్లాట్‌గా ఉందని ముందే తెలుసునని, అందుకే అనుభవంతో బౌలింగ్ చేయడం చాలా ముఖ్యమని భావించానని అన్నాడు.
టోర్నమెంట్ ప్రారంభానికి ముందు తన మానసిక స్థితి గురించి బుమ్రా వెల్లడించాడు. అకారణంగా తాను ఒత్తిడికి గురైనట్లు భావించానని, కాస్త ఎక్కువగా ప్రయత్నిస్తున్నట్లు అనిపించిందని అన్నాడు. బౌలింగ్ లో ఎక్కడా ఏ లోపం లేకపోయినప్పటికీ, బంతులను బాగానే సంధిస్తున్నప్పటికీ ఎక్కువ ఒత్తిడి పెంచుకుంటున్నానని అనిపించినట్లు చెప్పాడు. గేమ్ ప్లాన్ మార్చానన, అదే తనకు పూర్తిగా కలిసివచ్చిందని పేర్కొన్నాడు. సొంతగడ్డపై ప్రపంచ కప్ ఫైనల్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకోవడం తన కెరీర్‌లో అత్యంత గొప్ప క్షణాలలో ఒకటని అన్నాడు.
ఈ టీ20 ప్రపంచ కప్ లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో మొత్తం 28.0 ఓవర్లు వేశాడు. 14 వికెట్లు పడగొట్టాడు. 4/15 అతని అత్యుత్తమ ప్రదర్శన. టోర్నమెంట్ అంతటా నిలకడగా రాణించాడీ పేసర్. 12.42 సగటు, 6.21 ఎకానమీ రేటును నమోదు చేశాడు. 12.00 స్ట్రైక్ రేట్‌తో బంతులను సంధించాడు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications