IND vs ENG: లార్డ్స్‌లో బుమ్రాస్త్రం.. ఇంగ్లాండ్ జట్టును బోల్తా కొట్టించిన జస్ప్రీత్

IND vs ENG: రెండు వారాల విశ్రాంతి తర్వాత భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టుతో మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. మొదటి రోజు 4 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ 251 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. రెండో రోజు భారత పేసర్ బుమ్రా తన సొంత స్క్రిప్ట్‌ను సిద్దం చేసుకున్నాడు. బుమ్రా ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కదిలించే ఒక అద్భుతమైన స్పెల్‌తో ప్రారంభించాడు. బుమ్రా తన ప్రభావం చూపేందుకు సమయం వృథా చేయలేదు. ఉదయం తన రెండో ఓవర్లోనే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. బెన్ స్టోక్స్ 44 పరుగుల వద్ద నిష్క్రమించాడు. బుమ్రా వేసిన ఆ బంతికి స్టోక్స్ ఆశ్చర్యపోయాడు.

రూట్, వోక్స్ ఔట్.. హ్యాట్రిక్ మిస్
అయితే బుమ్రా అక్కడితో ఆగలేదు. అదే స్పెల్‌లో జో రూట్‌ను 104 పరుగుల వద్ద ఔట్ చేసి ఇంగ్లండ్ జట్టును భారీ దెబ్బ కొట్టాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ రెండో మొదటి బంతికే బౌండరీతో తన 37వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో బుమ్రా రూట్‌ను ఔట్ చేయడం ఇది 11వ సారి. టెస్టుల్లో ఇంగ్లండ్ బ్యాటర్లను అత్యధిక సార్లు ఔట్ చేసిన ప్యాట్ కమిన్స్ రికార్డును సమం చేశాడు. కొద్దిసేపటి తర్వాత డీఆర్ఎస్ డ్రామా కూడా చోటుచేసుకుంది. రూట్‌ను ఔట్ చేసిన మరో బంతికే క్రిస్ వోక్స్ కూడా పెవిలియన్ చేరాడు. క్రిస్ వోక్స్‌కు వ్యతిరేకంగా అప్పీల్ కోసం బుమ్రా, వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ నమ్మకంగా అప్పీల్ చేశారు. అయితే అంపైర్ దానిని నిరాకరించాడు. ఏదో శబ్ధం విన్నానని నమ్మిన బుమ్రా స్టంప్ మైక్‌లో "ఆవాజ్ ఆయా హై, ఆవాజ్ ఆయా హై" అని చెప్పడం రికార్డ్ అయ్యింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో సంభాషించిన తర్వాత భారత్ డీఆర్ఎస్ ను ఆశ్రయించింది. అల్ట్రాఎడ్జ్ ఒక స్పైక్‌ను ధ్రువీకరించింది. ఈ క్రమంలో బుమ్రా ఖాతాలో మరో వికెట్ చేరింది. మూడో టెస్టులో బుమ్రా ఇప్పటివరకు 4 వికెట్లు పడగొట్టాడు.

Jasprit Bumrah Strikes at Lord s Stokes Root Fall to Bumrah Magic in IND vs ENG Test

అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రైడన్ కార్స్ బుమ్రా వేసిన మరో బంతిని జాగ్రత్తగా ఎదుర్కోవడంతో బుమ్రాకు హ్యాట్రిక్ దక్కలేదు. గణాంకాల ప్రకారం.. 2023 నుంచి సొంత గడ్డపై జరుగుతున్న టెస్టుల్లో బెన్ స్టోక్స్ ఇన్‌సీమింగ్ బంతులకు వ్యతిరేకంగా కష్టపడుతున్నాడు. ఐదుసార్లు ఇలాంటి బంతులకు ఔటయ్యాడు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌లో జో రూట్ 612 బంతుల్లో 11 సార్లు ఔట్ అయ్యాడు.

జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు
ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ మరోసారి తాను భారత్ తరఫున ఆడిన అత్యుత్తమ బౌలర్లలో ఒకడని నిరూపించాడు. ఇంగ్లండ్‌లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కపిల్ దేవ్‌ను అధిగమించాడు. భారత్ తరఫున ఇంగ్లండ్‌లో ఆడిన 13 టెస్ట్ మ్యాచ్‌లలో కపిల్ దేవ్ 43 వికెట్లు పడగొట్టాడు. కపిల్ దేవ్ అత్యుత్తమ ప్రదర్శన 5/125. ఇప్పుడు మూడు వికెట్లు తీసి 46 వికెట్లతో కపిల్ దేవ్ ను అధిగమించాడు.

ఇషాంత్ శర్మ రికార్డుకు చేరువలో బుమ్రా
బుమ్రా ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌లో ఆడిన టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఇషాంత్ శర్మను అధిగమించే అవకాశం ఉంది.చివరిసారిగా 2021లో టెస్టు ఆడిన ఇషాంత్, ఇంగ్లండ్‌లో 14 మ్యాచ్‌లలో 48 వికెట్లతో ప్రస్తుతం రికార్డును కలిగి ఉన్నాడు. ఇదిలావుండగా, బుమ్రా కేవలం తొమ్మిది టెస్టుల నుంచే ఇంగ్లండ్ గడ్డపై 42 వికెట్లు సాధించాడు. ఇది ఇషాంత్ మార్క్‌ను అధిగమించడానికి బుమ్రా చేరువలో ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+