హార్దిక్ అవుట్ తో కృనాల్ వైల్డ్ సెలబ్రేషన్స్- ఆ వివాదమే అసలు కారణమా..!?

IPL వేళ పాండ్యా బ్రదర్స్ మధ్య ఏం జరుగుతోంది. ఈ ఇద్దరికీ టీ20 క్రికెట్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఇద్దరు వేర్వేరు టీంలు అయినా.. మ్యాచుల సందర్భంలో చాలా సన్నిహితంగా మెలిగే వారు. ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉండేవి. కాగా.. కొంత కాలంగా పాండ్యా బ్రదర్స్ మధ్య సంబంధాలు సరిగ్గా లేవనే చర్చ ఉంది. తాజా మ్యాచ్‌లో ఇవి నిజమే అనే విధంగా ఈ ఇద్దరి వ్యవహార శైలి కనిపించింది. హర్దిక్ అవుట్ అయిన వేళ కృనాల్ స్పందించిన తీరు ఈ అనుమానా కు బలం పెంచింది. ఈ ఇద్దరి మధ్య విభేదాల వెనుక ఆ వివాదమే అసలు కారణం అనే చర్చ జరుగుతోంది.

కృనాల్ పాండ్యా - హార్దిక్ పాండ్యా. ఈ ఇద్దరు ప్రస్తుత ఐపీఎల్ లో వేర్వేరు టీంలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలోనూ ఇదే రకంగా ఉన్నా.. గ్రౌండ్ లో మాత్రం ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే.. తాజాగా ముంబాయిలో బెంగళూరు వర్సస్ ముంబాయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఇద్దరి తీరు ఇప్పడు సోషల్ మీడియాలో చర్చగా మారింది. మ్యాచ్ జరుగుతు త సేపు ఇద్దరు సోదరులు ఒకరినొకరు కనీసం కళ్లలోకి కూడా చూసుకోలేదు. హార్దిక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆర్‌సీబీ తరపున ఫీల్డింగ్ చేస్తున్న కృనాల్ చాలా దూరం మెయింటైన్ చేశారు. వీరిద్దరి మధ్య గతంలో ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు ఇసుమంతైనా కనిపించలేదు. కాగా, హార్దిక్ పాండ్యా అవుట్ అయినప్పుడు కృనాల్ చాలా దూకుడుగా సంబరాలు చేసుకున్నారు. గాలిలోకి ఎగురుతూ, ఆవేశంగా అరుస్తూ ఆయన చేసిన హంగామా పైన సోషల్ మీడియాలో నెటిజెన్లు స్పందిస్తున్నారు.

krunal-pandya-was-delighted-as-jacob-duffy-removed-mumbai-indians-captain-hardik-pandya-here-the-de

పాండ్యా బ్రదర్స్ మధ్యం ఏం జరుగుతోంది..

ప్రత్యర్థి జట్టులో కీలక ఆటగాడు అవుట్ అయితే సంబర పడటం సాధారణమే అయినా... ఇక్కడ, కృనాల్ ప్రవర్తన అతిగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో గతంలో వెలుగు లోకి వచ్చిన విభేదాలే ఇప్పటికీ వీరిద్దరి మధ్య గ్యాప్ కు కారణమనే విశ్లేషణలు మొదలు అయ్యాయి. హార్దిక్ తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని చెబుతున్నారు. నటాషాతో కృనాల్ దంపతులు సన్నిహితంగా ఉండటం గ్యాప్ కు ఒక కారణంగా ప్రచారంలో ఉంది. హార్దిక్ ఐసీసీ ట్రోఫీ గెలిచినప్పుడు కూడా కృనాల్ సోషల్ మీడియాలో కనీసం విష్ చేయకపోవడం అప్పట్లోనే చర్చ జరిగింది. కుటుంబ వ్యవహారాలే ఇప్పుడు ఆటలో ఇద్దరు సోదరుల మధ్య గ్యాప్ ను పెంచాయా.. లేక, కృనాల్ తన్న సోదరుడిగా కాకుండా.. కీలక సమయంలో హార్దిక్ అవుట్ తో సంబరాలు చేసుకున్నారా అనే అంశం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు టీంలు రానున్న రోజుల్లో తలపడే సమయం లో ఇక.. పాండ్యా బ్రదర్స్ పైనే అందరూ ఫోకస్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+