కుంబ్లే విజన్, తెలంగాణ సంకల్పం.. లక్షన్నర మంది విద్యార్థులకు క్రీడా భవిష్యత్!

Telangana: తెలంగాణలో క్రీడా రంగానికి నూతన ఉత్తేజాన్ని, భవిష్యత్ ఒలింపిక్ ఛాంపియన్లకు వేదికను అందించే దిశగా ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వం క్రీడలు, విద్యా రంగాలను సమన్వయం చేస్తూ క్రీడా విజ్ఞాన శాస్త్రానికి ప్రాధానితనిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా ప్రతిభను గుర్తించేందుకు ఒక పటిష్టమైన వ్యవస్థను రూపొందించడానికి కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు మాజీ భారత క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్, టెన్విక్ సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కుంబ్లేతో ఒక అవగాహన ఒప్పందానని(MoU) కుదుర్చుకుంది.

ఒప్పందం వివరాలు ఇలా..
ఈ ప్రతిష్టాత్మక అవగాహన ఒప్పందం అనిల్ కుంబ్లే, తెలంగాణ క్రీడల శాఖ మంత్రి వాకాటి శ్రీహరి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాట్స్) ఛైర్మన్ శివసేన రెడ్డి, సాంస్కృతిక - క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, శాట్స్ వైస్ ఛైర్‌పర్సన్ అండ్ ఎండీ సోనిబాల దేవి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో జరిగింది. ఈ ఒప్పందం తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది.

Kumble Vision Telangana Mission Sports Revolution to Empower 1 5 Lakh Students

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు బలం

రాష్ట్రంలో యువత అభివృద్ధికి క్రీడలు, విద్యను రెండు కీలక చోదకాలుగా మార్చాలనే సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో అనుగుణంగా ఉందని అన్నారు. "ఈ వినూత్న సహకారం విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని క్రీడలు, క్రీడా విజ్ఞాన శాస్త్రంతో సమతుల్యం చేసుకుంటూనే.. వారిలో దాగి ఉన్న అద్భుతమైన క్రీడా ప్రతిభను గుర్తించి, పోషించడానికి అమూల్యమైన సహాయాన్ని అందిస్తుంది. తెలంగాణను భవిష్యత్ ఒలింపిక్ ఛాంపియన్లకు ఒక శక్తివంతమైన కేంద్రంగా మార్చడంలో ఇది ఒక బృహత్తర ముందడుగు" అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

1.5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం

ఈ వినూత్న కార్యక్రమం రాష్ట్రంలోని 238 సామాజిక సంక్షేమ పాఠశాలల నుంచి యువ క్రీడా ప్రతిభను వెలికితీయనుంది. దీని మొదటి దశలో రెజ్లింగ్, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, వెయిట్‌లిఫ్టింగ్‌తో సహా 5 ఒలింపిక్ క్రీడలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, సుమారు 1,50,000 మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు. ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రంలోని మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అత్యాధునిక శిక్షణతో పాటు, వారి విద్యాభ్యాసానికి ఎటువంటి ఆటంకం లేకుండా అకడమిక్ నైపుణ్యాన్ని కూడా పెంచుతారు. అంతేకాకుండా, ఈ కార్యక్రమం శారీరక విద్య (PE) ఉపాధ్యాయులకు ఆధునిక శిక్షణ, క్రీడా విజ్ఞాన శాస్త్ర పద్ధతులతో వారి నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయడంపై కూడా దృష్టి సారిస్తుంది. తద్వారా వారు మరింత సమర్థవంతంగా యువ ప్రతిభకు మార్గదర్శకం చేయగలుగుతారు.

అనిల్ కుంబ్లే ఆశాభావం
ఈ ఒప్పందం గురించి అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. "కేవలం ప్రతిభ ఉండటమే సరిపోదు. యువతకు సరైన అవకాశాలను సృష్టించడం మరింత ముఖ్యం. ఈ చొరవ ద్వారా తెలంగాణలోని యువ క్రీడాకారులకు ఒక పటిష్టమైన వేదికను అందించడం, కోచ్‌ల నైపుణ్యాలను మెరుగుపరచడం, తెలంగాణను దేశంలో క్రీడలను అత్యంత సమర్థవంతంగా ప్రోత్సహించే ప్రముఖ రాష్ట్రాలలో ఒకటిగా మార్చడానికి సహాయపడే ఒక కేంద్రాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాం" అని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+