ఆ ఫోన్ కాల్ తో తడిచిపోయింది..! దెబ్బకు ఐపీఎల్ వదిలి జంప్-లలిత్ మోడీ షాక్..!

ఐపీఎల్ బోర్డు మాజీ చైర్మన్ లలిత్ మోడీ (Lalit Modi) ఇవాళ మరో బాంబు పేల్చాడు. గతంలో ఐపీఎల్ ఛైర్మన్ గా ఉంటూ హఠాత్తుగా భారత్ వదిలి లండన్ పారిపోయిన లలిత్ మోడీ అప్పటి నుంచీ అక్కడే ఉంటున్నారు. అయితే ఆయన తన తాజా ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టారు. ఇందులో దావూద్ ఇబ్రహీం మాఫియా గ్యాంగ్ బెదిరింపుల వల్లే తాను లండన్ పారిపోవాల్సి వచ్చిందని వెల్లడించారు. దీంతో ఈ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

దావూద్ ఇబ్రహీం, అతని సిండికేట్ నుండి నిరంతరంగా ప్రాణహాని బెదిరింపులు ఎదుర్కోవడమే తాను క్రికెట్ నుంచి శాశ్వతంగా వైదొలగడానికి గల ప్రధాన కారణాలలో ఒకటని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ పేర్కొన్నారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఈ లీగ్ వ్యవస్థాపకుడైన తానపై జరిగిన వరుస బెదిరింపులు, హత్య కుట్రలు, పరారీలో ఉన్న దావూద్ కు నేరుగా శాటిలైట్ ఫోన్ కాల్ చేసి అర్ధరాత్రి పూట ఎదుర్కొన్న సంఘటనలు వివరించారు. తాను అక్రమ బెట్టింగ్ నెట్‌వర్క్‌లకు సహకరించడానికి నిరాకరించడమే డి-కంపెనీ సిండికేట్‌కు ప్రధాన లక్ష్యంగా మారడానికి కారణమని మోడీ తెలిపారు.

Lalit Modi s Bombshell Dawood s IPL Plot Death Threats and Why He Never Came Back

2012లో లండన్‌లో ఉండగా.. తెల్లవారుజామున 3:30 గంటలకు స్ధానిక మధ్యవర్తి ఒకరు తనను సంప్రదించి, "బాబా"గా పిలిచే పలుకుబడి ఉన్న ఒక మధ్యవర్తికి చెందిన పెంట్‌హౌస్ అపార్ట్‌మెంట్‌కు రావాలని ఒత్తిడి చేశాడని తెలిపారు. ఆయన అక్కడికి చేరుకోగానే, ఆ మధ్యవర్తి టెర్రస్‌పైకి వెళ్లి, శాటిలైట్ ఫోన్‌లో దావూద్ ఇబ్రహీంకు డయల్ చేసి, పరారీలో ఉన్న అతడిని స్పీకర్‌ ఫోన్‌లో పెట్టి నిలదీసినట్లు తెలిపారు. దీంతో తాను ప్యాంటులోనే మూత్రం పోసుకున్నానని వెల్లడించారు. దావూద్ ఇకపై నీ పనంతా అయిపోయిందని చెప్పి ఫోన్ పెట్టేశాడన్నారు. అప్పటి నుంచి ప్రతీ వారం ఫోన్ కాల్స్ వచ్చాయని, ఆ మధ్యవర్తి నష్టపరిహారం డిమాండ్ చేస్తూ.. తాము ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీపై నియంత్రణ కోరుకుంటున్నామని చెప్పాడన్నారు. లలిత్ మోడీ నిర్ణయాలతో తమకు భారీగా నష్టం వాటిల్లిందని చెప్పాడన్నారు.

Lalit Modi s Bombshell Dawood s IPL Plot Death Threats and Why He Never Came Back

2009లో జరిగిన ఐపీఎల్ రెండవ సీజన్ కల్లా తనపై దావూద్ గ్యాంగ్ మరింత శత్రుత్వం పెంచుకున్నారన్నారు. అప్పట్లో ఎన్నికల కారణంగా ఐపీఎల్ ను భారత్ లో కాకుండా దక్షిణాఫ్రికాకు తరలించామని, దీని వల్ల వీరికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. టోర్నీ పూర్తిగా రద్దవుతుందని అప్పట్లో బుకీలు భారీగా పందాలు కాశారని తెలుస్తోంది. ఐపీఎల్ ఛైర్మన్‌గా 2008-2010 మధ్య తాను తీసుకున్న కఠినమైన అవినీతి వ్యతిరేక నిర్ణయాలు మాఫియాను మరింత రెచ్చగొట్టాయని, దీంతో వివిధ ఖండాల్లో తనపై హత్యాయత్నాలు జరిగాయన్నాడు. చివరికి తాను క్రికెట్ నుంచి తప్పుకుని ఈ వివాదాలకు ముగింపు పలికినట్లు లలిత్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+