రూ. 27 కోట్లకు 19 రన్స్- నువ్వయిపోయావ్ రోయ్
Rishabh Pant: ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండో విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో రెండింట్లో గెలిచింది. మొత్తం నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. 8వ తేదీన నెక్స్ట్ మ్యాచ్ ఆడబోతోంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఢీ కొట్టనుంది.
ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడింది లక్నో సూపర్ జెయింట్స్. రెండో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. ఆ తరువాత పంజాబ్ కింగ్స్ చేతిలో చతికిలపడింది. ఇప్పుడు తన సొంత గడ్డపై ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన లోకల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్ మిఛెల్ మార్ష్ టాప్ స్కోరర్. 60 పరుగులతో అదరగొట్టాడు. మరో ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్- 53, మిడిలార్డర్‌లో ఆయుష్ బదోనీ- 30, డేవిడ్ మిల్లర్ 27 పరుగులు చేయడంతో స్కోర్ 200 దాటింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఈ స్కోర్‌ను అందుకోలేకపోయింది. అయిదు వికెట్ల నష్టానికి 191 పరుగులే చేయగలిగింది. రోహిత్ శర్మ గైర్హాజర్ అయిన గేమ్ ఇది. ఓపెనర్లు విల్ జాక్స్, రియాన్ రికెల్టన్ విఫలం అయ్యారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు నమన్ ధీర్- 46, సూర్యకుమార్ యాదవ్- 67 మాత్రమే దుమ్ము దులిపారు. డెత్ ఓవర్లల్లో హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడినా అప్పటికే మ్యాచ్ చేజారింది.
ఈ మ్యాచ్‌లో కూడా విఫలం అయ్యాడు కేప్టెన్ రిషభ్ పంత్. ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. అయిదే బంతులను ఎదుర్కొన్నాడీ వికెట్ కీపర్ బ్యాటర్. రెండు పరుగులే చేశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు ఢిల్లీ కేపిటల్స్‌పై డకౌట్. ఆ తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులకే పరిమితం అయ్యాడు.
ఇప్పుడు ముంబై ఇండియన్స్‌పైనా ఘోరంగా విఫలం అయ్యాడు. ఆరు బంతుల్లో రెండు పరుగులే చేసి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బోష్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఓ వరస్ట్ షాట్ ఆడి పెవిలియన్ చేరాడు రిషభ్ పంత్.
122 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఆఫ్ కట్టర్‌ను అంచనా వేయలేకపోయాడు. బంతి రాకముందే బ్యాట్‌ను అడ్డంగా ఊపాడు. ఎడ్జ్ తీసుకుని అక్కడికక్కడే గాల్లోకి ఎగిరిన ఈ బంతిని మిడాఫ్‌లో అద్భుతంగా అందుకున్నాడు బోష్క్. ఫుల్ డైవ్ కొట్టాడు. పంత్ రూపంలో 107 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది లక్నో.
ఇది- అతనిపై విమర్శల దాడికి దారి తీసింది. ట్రోల్స్‌కు తెర తీసింది. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లల్లో ఫామ్‌లో ఉన్న రిషభ్ పంత్‌ను కొనుగోలు చేయడానికి 27 కోట్ల రూపాయలు ఇచ్చింది లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్‌లో అందరికంటే ఎక్కువ రేటు పలికింది అతనే. ఇప్పటివరకు ఆ స్థాయిలో మాత్రం అతని ఆటతీరు ఉండట్లేదు.












Click it and Unblock the Notifications