Neeraj Chopra: నీరజ్ చోప్రా పెళ్లిచేసుకున్న వధువు ఎవరో తెలిస్తే షాక్..!
నీరజ్ చోప్రా.. 2020 టోక్యో ఒలింపిక్స్ లో మార్మోగిన పేరు. ఈ ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి భారత్ సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటాడు. ఆ తర్వాత 2024లో పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లోనూ పతకం గెలిచి క్రీడాభిమానుల గుండెల్లో నిలిచాడు. ఇలా భారత్ తరఫున రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించి ఎందరో భావిభారత ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలిచాడు ఈ హరియాణా బిడ్డ.
అయితే తాజాగా ఈ స్టార్ జావెలిన్ త్రోయర్ ఓ ఇంటివాడయ్యాడు. అవును.. హిమాని అనే యువతితో అతని వివాహం ఆదివారం గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నీరజ్ చోప్రా.. హిమానిను పెళ్లిచేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు తన ఇన్ స్టాలో అప్ లోడ్ చేశాడు. ' జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాను. మీ దీవెనలు కావాలి' అని క్యాప్షెన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. నీరజ్- హిమాని జోడీ బాగుందంటూ ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు, అథ్లెట్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా ఇప్పుడు అందరి మైండ్ లో ఒకటే ప్రశ్న వెంటాడుతోంది. ఎవరీ హిమానీ.. అని

ఎవరీ హిమాని..?
నీరజ్ సతీమణి హిమాని సొంత రాష్ట్రం హరియాణా. పానిపట్ కు చెందిన ఆమెకు చిన్నప్పటి నుంచి టెన్ని స్ అంటే ఆసక్తి ఉన్నట్లు సమాచారం. ఆమె దిల్లీ యూనివర్సిటీలో మంచి టెన్నిస్ ప్లేయరట. ఆ తర్వాత హిమాని అమెరికా న్యూ హాంప్‌షైర్‌లోని ఫ్రాంక్లిన్ పియర్స్ విశ్వవిద్యాలయంలో స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) పూర్తి చేసింది.
అలాగే ఇసెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి హిమాని మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం హిమాని అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications