ఓటమిని చూడకుండా మధ్యలోనే లేచి వెళ్లిపోతున్నాడేంటీ సుధా.. !!

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తు చేసింది.. భారత్‌. 61 పరుగుల తేడాతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లల్లో 175 పరుగులు చేయగా.. పాకిస్తాన్ ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయింది. బౌలర్ల ధాటికి ప్రారంభం నుంచీ వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. 114 పరుగులకు కుప్పకూలింది. ఈ విజయంతో భారత్.. సూపర్ 8 దశకు దూసుకెళ్లింది.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ను ఆద్యంతం తిలకించడానికి వచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహసిన్ నఖ్వి.. స్టేడియం నుంచి అర్ధాంతరంగా బయటికి వెళ్లిపోయాడు.. అది కూడా పాకిస్తాన్ ఇన్నింగ్ సమయంలో. వరుస వికెట్లు పడుతోండటంతో ఓటమి తప్పదని ముందే గ్రహించినట్టున్నాడు నఖ్వీ. పూర్తిగా చూడకుండా మధ్యలోనే స్టేడియం నుంచి నిష్క్రమించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.

Mohsin Naqvi PCB Chairman Early Exit from Colombo Stadium during IND vs PAK match sparks buzz

భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు నఖ్వీ మైదానాన్ని వీడారు. ఐసీసీ ఛైర్మన్ జై షా, శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రతినిధులు, ఇతర క్రికెట్ నిర్వాహకులతో సమావేశాల కోసం ఆయన కొలంబో వచ్చారు. మ్యాచ్ చూడటానికి స్టేడియానికి చేరుకున్నారు. భారత్ ఇన్నింగ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో ఉన్నారు. వికెట్లు పడ్డప్పుడు చప్పట్లు కొట్టడం కనిపించింది.

పాకిస్తాన్ ఇన్నింగ్ సమయంలోనూ అక్కడే ఉన్నారు. తొలి అయిదు వికెట్లు పడ్డ తర్వాత స్టేడియం నుంచి బయటికి వెళ్లిపోయారు. నఖ్వీ కారు స్టేడియం నుంచి నిష్క్రమిస్తోండటం ఈ వీడియోలో రికార్డయింది. ఆయన అకస్మాత్తుగా వెళ్ళిపోవడంపై పీసీబీ నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. ఈ ఓటమి అనంతరం నఖ్వీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం అతనేనంటూ పాకిస్తాన్ మాజీ ప్లేయర్లు మండిపడుతున్నారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+